ఈ హీరో.. కేసీఆర్‌ బంధువని ఒప్పుకున్నాడు

Update: 2017-08-31 10:18 GMT
విజయ్ దేవరకొండ ఫస్ట్ తెలంగాణ సూపర్ స్టార్ అని వర్మ లాంటి వాళ్లు కీర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొందరు కులాభిమానం ఉన్నవాళ్లయితే విజయ్‌ కి క్యాస్ట్ ట్యాగ్ కూడా తగిలించేశారు. కమ్మ.. కాపు హీరోల జోరు సాగే టాలీవుడ్లోకి వెలమ సూపర్ స్టార్ వచ్చాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెలమ కులస్థుడే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కు - విజయ్ దేవరకొండకు చుట్టరికం ఉందన్న ప్రచారం కూడా కొంత కాలంగా నడుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సైతం ఇదే మాట అన్నారు.

విజయ్ దేవరకొండ కేసీఆర్‌ కు బంధువని.. అందుకే ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు వీహెచ్. దీనికి విజయ్ కౌంటర్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కేసీఆర్ కుటుంబంతో దూరపు చుట్టరికం ఉన్న సంగతి వాస్తవమే అన్నాడు. చిన్న కమ్యూనిటీ కావడం వల్ల ఎక్కడో ఒక చోట చుట్టరికం కలవడంలో ఆశ్చర్యమేమీ లేదని అతను చెప్పాడు. ఐతే కేసీఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని.. తాను కేసీఆర్‌ ను ఎప్పుడూ కలవలేదని అతను స్పష్టం చేశాడు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన్ని త్వరలో కలవాలనుకుంటున్నానని విజయ్ చెప్పాడు.
Tags:    

Similar News