ఏమో అనుకున్నాం కానీ.. విజయ్ దేవరకొండ మామూలోడు కాదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతడికొచ్చిన ఫాలోయింగ్ మామూలుది కాదని అర్థమవుతోంది. అతడిది వాపు కాదు.. బలుపే. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ హీరోగా నటించిన కొత్త సినిమా ఏదీ ఇప్పటిదాకా రిలీజ్ కాకపోయినా.. అతడి క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఇటీవలే విజయ్ ‘రౌడీ’ పేరుతో సొంత అపారెల్ బ్రాండ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ‘రౌడీ క్లబ్’ పేరుతో ఒక యాప్ కూడా లాంచ్ చేశాడతను. రెండు రోజుల కిందట ఈ యాప్ లాంచ్ కాగా.. అది ఆండ్రాయిడ్.. యాపిల్ ఫోన్లలో నంబర్ వన్ లైఫ్ స్టైల్ యాప్ గా కొనసాగుతుండటం విశేషం. 2 లక్షల మందికి పైగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ‘రౌడీ’ బ్రాండ్ బట్టల కోసం బుకింగ్స్ చేసుకున్న వాళ్లకు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ డెలివరీ ఇవ్వబోతోంది విజయ్ సంస్థ. వీటి కోసం విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయ్ క్రేజ్ ఏంటో తెలియజెప్పే మరో ఉదాహరణ.. అతడి కొత్త సినిమా ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాటకు యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్. ఈ పాటకు వారం తిరక్కుండానే కోటి వ్యూస్ రావడం విశేషం. మూడు రోజులకే 80 లక్షల వ్యూస్ మార్కును దాటేసిందీ పాట. ఇన్ స్టంట్ హిట్టయిన ఈ పాట యూత్ ఫోన్లలో మార్మోగుతోంది. ఇందులో ఈ పాట గొప్పదనంతో పాటు విజయ్ క్రేజ్ కూడా ఉన్న మాట వాస్తవం. అతడి తర్వాతి సినిమా కోసం యూత్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ‘ట్యాక్సీవాలా’ మేలోనే రావాల్సింది. కానీ అది వాయిదా పడిపోయింది. ఆగస్టు 15న రాబోయే ‘గీత గోవిందం’ కోసం క్యూరియస్ గా ఉన్నారు జనాలు. ఆ చిత్రానికి వచ్చే ఓపెనింగ్స్.. విజయ్ క్రేజ్ ఏంటో మరోసారి తెలియజెప్పడం ఖాయం.