సెంటిమెంటు పరిశ్రమలో హిట్టు ఒక్కటే అవకాశాలిప్పిస్తుంది. ఒకే ఒక్క అర్జున్ రెడ్డి చిత్రం దేవరకొండ ఫేట్ మార్చేసింది. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకోబోతున్నాడు. ఇన్నాళ్లు తెలుగు సినిమాల వరకే పరిమితం అనుకుంటే.. ప్రస్తుతం అతడు కరణ్ జోహార్ అండగా బాలీవుడ్ కి వెళుతున్నాడు. పూరితో ఫైటర్ ని పాన్ ఇండియా కేటగిరీకి షిఫ్ట్ చేశాడు.
ఇక అర్జున్ రెడ్డి వల్ల ఉత్తరాదినా దేవరకొండకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కబీర్ సింగ్ చూసినవాళ్లంతా అర్జున్ రెడ్డి చిత్రాన్ని డిజిటల్ లో చూసి ఆ తర్వాత దేవరకొండకు ఫ్యాన్స్ అయిపోయారు. విజయ్ కి కరణ్ జోహార్ అంతటి వాడే స్నేహితుడు అయిపోవడమే గాక ఫైటర్ నిర్మాణ భాగస్వామిగా మారడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన షాలిని పాండే ఇప్పటికే బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. యశ్ రాజ్ ఫిలింస్ జయేశ్ భాయ్ జోర్ధార్ చిత్రంలో ఏకంగా రణవీర్ సింగ్ సరసన నటించేస్తోంది.
అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో సెన్సేషన్స్ కి తెరతీసి బాలీవుడ్ లో మరో చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ బాలీవుడ్ లో పలు చిత్రాలకు రీరికార్డింగ్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. సెంటిమెంటు పరిశ్రమలో హిట్టు అవకాశాలిస్తుంది అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ వేరే ఏదీ అవసరం లేదేమో!