తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కరోనా వైరస్ కారణంగా పెద్ద ఎత్తున వేడుక నిర్వహించకుండా సింపుల్ గా ఒక ప్రెస్ మీట్ తరహాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించాడు. పాటలకు డాన్స్ వేయడంతో పాటు సరదాగా మాట్లాడాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తనకు పోటీ అయిన అజిత్ గురించి మాట్లాడిన విజయ్ తనపై జరిగిన ఐటీ రైడ్స్ గురించి కూడా స్పందించాడు.
20 ఏళ్ల నుండి జీవితం చాలా ప్రశాంతంగా సాగి పోతుంది. ఇలాంటి సమయంలో గత కొన్ని వారాలుగా ఐటీ రైడ్స్ తో కాస్త మానసిక అశాంతతను ఎదుర్కొంటున్నాను. ఈ ఐటీ రైడ్స్ ఇప్పటికి అయినా పూర్తి అయితే మళ్లీ ప్రశాంతంగా ఉంటానంటూ తనపై జరుగుతున్న ఐటీ రైట్స్ ను ఉద్దేశించి ప్రభుత్వంపై పంచ్ వేశాడు. ఈ విషయంలో అభిమానులు తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ విజయ్ అన్నాడు.
‘బిగిల్’ చిత్రం తర్వాత నటిస్తున్న సినిమా అవ్వడంతో మాస్టర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఖైదీ దర్శకుడ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ తెరకెక్కిన విషయం తెల్సిందే. వరుసగా బ్లాక్ బస్టర్స్ దక్కించుకుంటున్న విజయ్ ఈ చిత్రంతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇక మాస్టర్ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో లేదా సుధా కొంగర దర్శకత్వంలో విజయ్ మూవీ ఉంటుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.