ఇక ఆమె కెరీర్ ముగిసినట్టేనా..?

కెరీర్ మొదలు పెట్టిన చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆన్ స్క్రీన్ సినిమాలతోనే కాదు ఆఫ్ స్క్రీన్ వార్తలతో కూడా హడావిడి చేస్తుంది.

Update: 2025-01-09 07:30 GMT

సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఇప్పుడు సినిమాల మీద అంత ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. ఆఫర్లు రాక అమ్మడు అలాంటి నిర్ణయం తీసుకుందా అంటే కాదు ఆఫర్లు వస్తున్నా సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ పెద్దగా లేదనే కారణంతోనే అమ్మడు ఇలా చేస్తుందని అంటున్నారు. కెరీర్ మొదలు పెట్టిన చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆన్ స్క్రీన్ సినిమాలతోనే కాదు ఆఫ్ స్క్రీన్ వార్తలతో కూడా హడావిడి చేస్తుంది.

స్టార్ తనయురాలైన ఈ అమ్మడి కెరీర్ ఇక దాదాపు ముగిసినట్టే అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే కమల్ గారాల పట్టి శృతి హాసన్ అని తెలుస్తుంది. మ్యూజిక్ కంపోజర్ గా తనలోని ఇంట్రెస్ట్ ను ప్రేక్షకులకు ముందు పరిచయం చేసిన శృతి హాసన్ తెర మీద కథానాయికగా సర్ ప్రైజ్ చేసింది. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా పవర్ స్టార్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి కెరీర్ విషయంలో తిరిగి చూసుకోలేదు అమ్మడు.

ఐతే సినిమాలు పర్సనల్ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్ చేయడంలో కాస్త ఇబ్బంది పడుతూ వచ్చింది శృతి హాసన్. ప్రేమికురాలిగా ఉండటానికి ఇష్టపడే శృతి హాసన్ తన డేటింగ్ వార్తలతో ఎప్పుడు హా**ట్ టాపిక్ గానే ఉంటుంది. ఒకానొక దశలో వాటి వల్ల సినిమాలను కూడా నెగ్లెక్ట్ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఈమధ్యనే అడివి శేష్ సినిమా డెకాయిట్ లో నటించాల్సి ఉన్నా ఏమైందో ఏమో కానీ ఆమెను కాదని ఇప్పుడు మృణాల్ తో ఆ సినిమా కానిస్తున్నారు.

ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజినికాంత్ కూలీతో పాటుగా సలార్ 2 లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు తప్ప మరో కొత్త సినిమా చేయట్లేదు. శృతి హాసన్ కూడా సినిమాల మీద అంత ఇంట్రెస్టెడ్ గా లేదని టాక్. సినిమాల మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న కథానాయికలు చాలా మంది ఉండగా కాదంటున్నా శృతి హాసన్ వెంట పడటానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపట్లేదు. సో అమ్మడి కెరీర్ ముగిసినట్టే అనిపిస్తుండగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అన్నది చూడాలి. స్టార్ హీరోలందరితో నటించి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ ఇలా సినిమాలను మధ్యలో వదిలేయడం మాత్రం ఆమె ఫ్యాన్స్ కి మింగుడుపడట్లేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News