తమిళ్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్ మరియు విజయ్ లు కలిసి ఒక సినిమాను చేయబోతున్నారు. కానీ ఇద్దరు కలిసి నటించబోవడం లేదు. కమల్ హాసన్ నిర్మాణం లో విజయ్ హీరోగా సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం తమిళ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబో సినిమాకు వెట్రి మారన్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చింది.
కొన్ని వారాల క్రితం కమల్ హాసన్ ఈ విషయాన్ని గురించి మాట్లాడాడు. అయితే ఆ సమయంలో కమల్ అసంపూర్తిగా మాట్లాడటం మరియు అస్పష్టంగా ప్రకటన ఉండటంతో విజయ్ హీరోగా కమల్ సినిమా ఎంత వరకు నిజమో అంటూ అంతా అనుమానం వ్యక్తం చేశారు. కానీ తాజాగా దర్శకుడు వెట్రి మారన్ ఆ విషయాన్ని క్లారిటీ గా చెప్పడంతో తమిళ్ సినీ ప్రేక్షకులకు ఒక స్పష్టత వచ్చింది.
విక్రమ్ సినిమాకు ముందు వరకు కమల్ హాసన్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విక్రమ్ సినిమా వల్లే తాను అప్పులను తీర్చేశాను అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కమల్ పేర్కొన్నాడు. అలాంటిది విజయ్ వంటి స్టార్ హీరోతో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాను నిర్మించేందుకు కమల్ ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యం.
కమల్ విక్రమ్ సినిమా తో వచ్చిన లాభాల వల్లే విజయ్ తో సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యి ఉంటాడు అంటున్నారు. వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సినిమా అంటే కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్. పైగా ఆ సినిమాకు కమల్ హాసన్ నిర్మాత అయితే అద్భుతమై అన్నట్లుగా తమిళ్ సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కమల్ వెట్రిమారన్.. విజయ్ ల సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసినా కూడా సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్యానర్ లో రెండు మూడు చిన్న సినిమాలను కూడా నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. మొత్తానికి కమల్ నిర్మాతగా వరుస సినిమాలు చేయడం ఆయన అభిమానులకు కిక్ ఇస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.