విజ‌యేంద్ర ప్ర‌సాద్ 'ర‌జాకార్ ఫైల్స్' ఏమైన‌ట్లు?

Update: 2023-05-10 05:00 GMT
'ది క‌శ్మీర్ ఫైల్స్' స‌క్సెస్ త‌ర్వాత ఈ జాన‌ర్ సినిమా అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయింది. అటుపై వివేక్ అగ్నిహోత్ని 'ఢిల్లీ ఫైల్స్' అంటూ కొత్త చిత్రం మొదలు పెట్ట‌డంతో?  ఫైల్స్ అనేది మార్కెట్ లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. వీటిని చూసే స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం 'ర‌జాకార్ ఫైల్స్' చిత్రా క‌థ సిద్దం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది.

తెలంగాణ ప్రాంతంలో ర‌జాక‌ర్ల అరాచ‌కాల‌ని ఆధారంగా చేసుకుని క‌థ సిద్దం చేసిన‌ట్లు తెలుస్తుంది. 'క‌శ్మీర్ ఫైల్స్' త‌ర‌హాలో ఈ చిత్రాన్ని సంచ‌ల‌నంగా మార్చాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్. తాజాగా 'ది కేర‌ళ స్టోరీ'స్ కూడా రిలీజ్ అయి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఉగ్ర‌వాదుల నేప‌థ్యంతో తెరకెక్కిన సినిమా పాన్ ఇండియాలో గ్రేట్ విక్ట‌రీ అందుకుంది. సిస‌లైన పాన్ ఇండియా సినిమా అంటే ఇది అంటూ వ‌ర్మ సైతం మెచ్చారు.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి 'ర‌జాకార్ ఫైల్స్' పై నెట్టింట ఆస‌క్తిక‌ర చర్చ మొద‌లైంది. ఈ సినిమా ఎంత వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్లు? ఎప్పుడు సినిమా ప్రారంభిస్తున్నారు?  లేక సైలెంట్ గా లాంచ్ చేసారా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అప్ప‌ట్లో ఈ సినిమా గురించి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ సిద్ద‌మైంద ని..త్వ‌ర‌లోనే ప్రారంభింస్తామ‌ని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు.

అలాగే ఈ సినిమాకు ఆయ‌నే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?  లేక ఆ బాధ్య‌త‌లు మ‌రెవ‌రికైనా అప్ప‌గిస్తారా? అని సందేహం ఉంది. ఈ సినిమా కోసం కొత్త న‌టీన‌టుల్ని తీసుకుంటారా?  లేక సీనియ‌ర్ ప్యాడింగ్ ఉంటుందా? అన్న వంద ర‌కాల సందేహాలు ఉన్నాయి. వీట‌న్నింటిపై విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లారిటీ ఇస్తే! బ్యాకెండ్ ఏం జ‌రుగుతుంద‌న్న‌ది తెలియ‌దు.

పాన్ ఇండియాలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీల‌కు భారీ డిమాండ్ ఉంది. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాల క‌థా సృష్టి క‌ర్త ఆయ‌నే. అలాగే బాలీవుడ్ లోనూ ప‌లు హిట్ సినిమాల‌కు స్టోరీలు అందించారు. ఈ నేప‌థ్యంలో 'ర‌జాకార్ పైల్స్ 'పై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి సంత‌రించుకుంటుంది.

Similar News