మ‌హేష్ తో చాలా క‌ష్టంః విజ‌యేంద్ర ప్ర‌సాద్

Update: 2021-06-01 06:33 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయ్యింద‌న్న‌ది ఓల్డ్ న్యూస్‌. వీరిద్ద‌రూ ఎలాంటి స్టోరీతో ఆడియ‌న్స్ ను ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నార‌న్న‌దే ఇప్పుడు టాపిక్‌. అందుతున్న ఇన్ పుట్స్ ప్ర‌కారం.. రెగ్యుల‌ర్ స్టోరీ చేసే అవ‌కాశమైతే లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆడియో ఫంక్ష‌న్లో మాట్లాడుతూ.. ‘‘జేమ్స్ బాండ్ త‌ర‌హా సినిమా కావాలా? కౌబాయ్ తరహా మూవీ కావాలా? మీరే చెప్పండి’’ మహేష్ ఫ్యాన్స్ ను అడిగారు రాజమౌళి. దాని ప్రకారం.. తాను పూర్తిగా డిఫరెంట్ మూవీని మహేష్ తో ప్లాన్ చేస్తానని అప్పుడే ఇండైరెక్ట్ గా చెప్పారు జక్కన్న. మరి, ఇప్పుడు ఎలాంటి స్టోరీని ఫైనల్ చేస్తున్నారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఉంది.

ప్ర‌చార‌మైతే చాలా ర‌కాలుగా సాగుతోంది. జ‌క్క‌న్న మ‌రోసారి పీరియాడిక‌ల్ డ్రామానే ఎంచుకుంటున్నాడ‌ని, ఛ‌త్ర‌ప‌తి శివాజీ చ‌రిత్ర‌తో సినిమా తెర‌కెక్కించ‌బోతున్నాడ‌నే చ‌ర్చ సాగింది. ఈ సినిమాలో మ‌హేష్ శివాజీగా క‌నిపించ‌బోతున్నార‌ని కూడా అన్నారు. ఇదేకాకుండా.. మ‌రొక‌టి, ఇంకొక‌టి అన్నారు. కానీ.. వాస్త‌వం ఏంట‌న్న‌ది మాత్రం రివీల్ కాలేదు. అయితే.. తాజాగా రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మ‌హేష్‌ స్టోరీ గురించి మాట్లాడారు.

క‌మెడియ‌న్ అలీ హోస్ట్ గా ప్ర‌సార‌మ‌వుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఆయ‌న తాజాగా హాజ‌ర‌య్యారు. రాజ‌మౌళి ప్ర‌తిసినిమాకూ విజ‌యేంద్ర ప్ర‌సాదే స్టోరీ అందిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న ఆయ‌న.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు క‌థ‌లు అందించారు. ‘బాహుబ‌లి’ లాంటి స్టోరీని అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. మ‌హేష్ మూవీకి ఎలాంటి స్టోరీని సిద్ధం చేస్తున్నార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హేష్ కు క‌థ రాయ‌డ‌మ‌నేది చాలా క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని చెప్పారు. అది ఖ‌చ్చితంగా ట‌ఫ్ జాబ్ అన్నారు. మ‌హేస్ కు క‌థ రాయాలంటే పూరీ జ‌గ‌న్నాథ్ స‌ల‌హా తీసుకోవాల‌ని న‌వ్వేశారు. మొత్తానికి మ‌హేష్ కు స్టోరీ అందించ‌డానికి చాలా డీప్ గా ఆలోచిస్తున్నార‌నే విష‌య‌మైతే అర్థ‌మైపోయింది. మ‌రి, అది ఎలాంటి క‌థ‌? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News