టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు 26 చిత్రాల్లో కనిపించారు. అందులో కొన్ని సూపర్ హిట్స్ - యావరేజులు - ప్లాపులు - డిజాస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' 'ఏకే' రీమేక్ లతో పాటుగా.. మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. అయితే ఇన్నేళ్లలో పవన్ రిజెక్ట్ చేసిన కథలు ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కథని జడ్జ్ చేయలేకనో.. కథ నచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకనో.. తన ఇమేజ్ కు సెట్ కాదనో.. మరే ఇతర కారణాలతోనే పవన్ తన వద్దకు వచ్చిన సినిమాలను తిరస్కరించారు. అయితే రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్స్ అయినప్పుడు మాత్రం పవర్ స్టార్ ఆ సినిమా చేయాల్సింది అని పీకే అభిమానులు ఫీల్ అవుతుంటారు. అలాంటి వాటిలో 'విక్రమార్కుడు' సినిమా ఒకటి.
రవితేజ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమార్కుడు'. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. అతనికి స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రెడీ చేశారట. ఈ క్రమంలోనే పవన్ ను కలిసి స్క్రిప్ట్ కూడా నేరేట్ చేశారట. ఈ కథ నచ్చినప్పటికీ పవన్ ఈ సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం పవర్ స్టార్ ఆ సమయంలో కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోవాలనే ఆలోచనలో ఉండటమేనట.
ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ - రాజమౌళి కలసి రవితేజ తో చేయాలని డిసైడ్ అవ్వడం.. దానికి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం.. అది 'విక్రమార్కుడు' సినిమాగా రెడీ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడం జరిగిపోయాయి. మరి ఈ సినిమాలో పవన్ నటించి ఉంటే ఫలితం ఏ విధంగా ఉండేదో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. చలాకీగా తిరిగే దొంగ గా డ్యూయల్ రోల్ లో పవర్ స్టార్ ఎలాంటి సంచనాలు నమోదు చేశావాడో.