టాలీవుడ్ లో అపజయమెరగని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెలిగిపోతున్నారు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా మారి వరుస బ్లాక్ బస్టర్లతో సంచలనాల దర్శకుడయ్యారు. ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. బాహుబలి చిత్రంతో అతడి ఫేట్ మారిపోయింది. పాన్ ఇండియా చిత్రాలతో టాలీవుడ్ ఫేట్ నే మార్చిన ఘనుడయ్యాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తూ నిత్యం వార్తల్లో సంచలనంగా మారుతున్నారు. అయితే ఆయన ఇంతింతై అన్న చందంగా ఎదగడం వెనక తొలిగా సహకరించిన బలమైన శక్తి ఎవరు? అంటే రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ క్లారిటీనిచ్చారు.
విజయేంద్ర ప్రసాద్ పరిశ్రమలో అగ్రశ్రేణి రచయిత అయినా రాజమౌళిని దర్శకుడిగా తీర్చిదిద్దడంలో తన పాత్ర కంటే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పాత్ర అమోఘమైనదని అన్నారు. రాజమౌళిలో ప్రతిభను గుర్తించి అతన్ని ప్రోత్సహించింది రాఘవేంద్రరావు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
రాఘవేంద్రరావుకు రాజమౌళి ఎక్కువ కాలం సహకరించారని.. దాంతో అతడి ప్రతిభను గుర్తించి `స్టూడెంట్ నెంబర్ 1` చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత మిగిలినది చరిత్ర అందరికీ తెలిసిందే. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.