ప్రముఖ నిర్మాత పై క్రిమినల్ కేసు పెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

Update: 2020-07-16 10:10 GMT
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రోజుకో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజాగా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ సినీ నిర్మాత పై ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ పథక్ కేసు నమోదు చేసాడు. ఆ నిర్మాత ఎవరో కాదు ఏక్తా కపూర్. ఆమె సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తోంది. ఏక్తా కపూర్ సినిమాలను నిర్మించడమే గాక పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. అయితే మరి ఆమె మీద కేసు ఎందుకు నమోదు చేయడానికి అసలు కారణం ఏంటంటే.. ఏక్తా కపూర్ నిర్మించిన అన్ సెన్సార్డ్ సీసన్ -2 వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాల కారణంగా ఏక్తాకపూర్ పై క్రిమినల్ కేస్ బనాయించాడు వికాస్ పథక్. అయితే అన్ సెన్సార్డ్ సీసన్ -2 లోని 'ప్యార్ ఔర్ ప్లాస్టిక్' అనే ఎపిసోడ్ లో ఒక వ్యక్తికి ఆర్మీ దుస్తులు వేసి అతనితో అభ్యంతర కరమైన సంభాషణలు పలికించారని ఈ కేస్ పెట్టినట్లు సమాచారం.

అంతేగాక ఆర్మీ దుస్తులలో వ్యక్తి సంభాషణ అభ్యంతర కరంగా ఉండటమే గాక ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అగౌరవంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ ఈ కేసు వేయడం జరిగిందట. అయితే ఈ కేసు పై కోర్టు ఆగష్టు 24న విచారణ జరపనున్నారట. ఇక నాలుగు పదుల వయసు పై బడిన ఏక్తా కపూర్.. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్ అధినేత. 1994లో బాలాజీ టెలిఫిలిమ్స్ ప్రారంభించిన నాటి నుండి ఏక్తా.. ఆ నిర్మాణ సంస్థకి క్రియేటివ్ హెడ్ అండ్ జాయింట్ డైరెక్టరుగా సేవలందిస్తోంది. ఇక ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా సేవలందిస్తున్న ఏక్తా కపూర్ పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. ఇదిలా ఉండగా.. ఏక్తా కపూర్​తో పాటు ఓటీటీ ప్లాట్​ ఫామ్​ ఏఎల్​టీ బాలాజీ, శోభా కపూర్​, జితేంద్ర కపూర్​లపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే బాలీవుడ్ లో ఏక్తా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నిర్మించిన డ్రీమ్ గర్ల్ సినిమా, నాగిని సీరియల్ మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల 24న ఏక్తాను విచారించనుండి ముంబై కోర్టు.
Tags:    

Similar News