ఆ డైరెక్టర్ ఎట్టకేలకు నానితో మొదలెడుతున్నాడు

Update: 2015-12-06 04:21 GMT
సక్సెస్ ఎక్కడైనా విలువైందే. కానీ సినీ పరిశ్రమలో దాని విలువ ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందుకే ఇక్కడ విజయం సాధించిన వాడికి సింహాసనం వేసుకుని కూర్చోబెడతారు. ముఖ్యంగా తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన డైరెక్టరుకుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ముందు రోజు వరకు ఒక వ్యక్తిలా ఉన్న ఆ డైరెక్టర్.. సినిమా విడులైన రోజు.. సాయంత్రానికల్లా ఓ శక్తిలా మారిపోతాడు. అతడి ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంటుంది. ప్రొడ్యూసర్లు అడ్వాన్సులతో రెడీ అయిపోతారు. అందుకే తొలి సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉండే డైరెక్టర్లు రెండో సినిమాకు కూడా స్క్రిప్టు రెడీ చేసుకుని రెడీగా ఉంటారు. మంచి ఆఫర్ చూసి ఓకే చెప్పేస్తారు.

కానీ రెండేళ్ల కిందట ‘ఉయ్యాల జంపాల’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ మాత్రం రెండో సినిమా విషయంలో అస్సలు తొందరపడలేదు. ఆఫర్లకు కొదవేమీ లేకున్నప్పటికీ అతను మాత్రం వెంటనే సినిమా ఒప్పుకోలేదు. ఇలా తొలి సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ ఇంత కాలం ఖాళీగా ఉండటం అరుదైన విషయం. ఐతే ఎట్టకేలకు విరించి తన రెండో సినిమా దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. యువ కథానాయకుడు నాని హీరోగా సినిమా తీయడానికి స్క్రిప్టు రెడీ చేశాడట విరించి. ఇప్పటికే నానికి కథ వినిపించడం.. అతను ఓకే చెప్పడం అయిపోయాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. నాని ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా చేస్తాడు. ఆ తర్వాత విరించి మూవీ మొదలవుతుంది.
Tags:    

Similar News