స్టార్స్ నటించిన చిత్రాలకే పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసినా కంటెంట్ నచ్చలేదంటే ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. ఇక చిన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల భారీ చిత్రాలు, పాన్ ఇండియా సక్సెస్ ల నేపథ్యంలో చిన్న సినిమాల కోసం థియేటర్లకు రావాలంటే సగటు ప్రేక్షకుడు సవాలక్షా ఆలోచిస్తున్నాడు. ఎందుకు వెళ్లాలి? ..ప్రత్యేకంగా ఏముందని వెళ్లాలి? అని ప్రశ్నించుకుంటున్నాడు. అలాంటి ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించాలంటే చిన్న సినిమాల్లో ఏదో ఒక సమ్‌థింగ్ స్పెషల్ వుండాల్సిందే.
లేదా అలా మా సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ వుందని ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించేలా ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రమోషన్స్ పరంగా ఇలాంటి జిమ్మిక్కలు చేస్తూ చిన్న చిత్రాలు ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేస్తున్నాయి. ఆ మధ్య విడుదలైన `అర్జున్ రెడ్డి` నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన `డీజే` టిల్లు వరకు ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా మారి థియేటర్లకు జనాలని రప్పించి బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అనిపించుకున్నాయి.
ఈ ప్రచార పర్వంలో `అర్జున్ రెడ్డి` సినిమాలోని కిస్ సీన్ లని, పోస్టర్ లని చూపిస్తూ ఓ ప్రముఖ ఛానల్ రచ్చకు తెరలేపింది. ఏదో ఒకటి చేసి కాంట్రవర్సీని సృష్టించాలని డిబేట్లు, చర్చలు మొదలు పెట్టింది. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావుని లైవ్ డిబేట్ లోకి దించేసి `అర్జున్ రెడ్డి` సినిమా రిలీజ్ ని దాదాపుగా ఆపేయడానికి నానా తంటాలు పడింది. ఇందు కోసం కాంట్రవర్సీల లేడీ యాంకర్ ని రంగంలోకి దింపారు. అయితే ఇవేవీ విజయ్ దేవరకొండ ముందు నిలబడలేకపోయాయి. విజయ్ టాకింగ్ పవర్ తో సదరు యాంకర్‌కి, టీవీ ఛానల్ కి దిమ్మదిరిగి బొమ్మకనిపించేలా చేశాడు.
సదరు టీవీ ఛానల్ సృష్టించిన కాంట్రవర్సీ డిబేట్ లనే తన సినిమాకు పబ్లిసిటీగా మార్చుకుని పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకుని పబ్లిసిటీ గేమ్ లో తానే విన్నర్ నని సగర్వంగా నిరూపించుకున్నాడు. సరిగ్గా ఇదే స్టంట్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన `అశోకవనంలో అర్జున కల్యాణం` సినిమాకు జరిగింది. ఈ మూవీని విబిన్నంగా ప్రమోట్ చేయాలనుకున్న విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేశాడు. యూట్యూబ్ ఛానల్ యాంకర్ తో రోడ్డుపై షూట్ చేసిన ప్రాంక్ వీడియో పై ప్రముఖ టీవి ఛానల్ రచ్చ చేయడం మొదలు పెట్టింది.
నడీ రోడ్డుపై విశ్వక్ సేన్ న్యూసెన్స్ అంటూ డిబేట్ లు మొదలు పెట్టింది. ఇందుకు విశ్వక్ సేన్ ని కూడా డిబేట్ కు ఆహ్వానించింది. ఇక్కడే సదరు టీవీ ఛానల్ యాంకర్ కు హీరో విశ్వక్ సేన్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్ ను `పాగల్ సేన్` అనిపిలుస్తారని, అతనొక `డిప్రెస్డ్ మ్యాన్` అని అవమానించింది. ఈ మాటలు విన్న విశ్వక్ సేన్ వెంటనే యాంకర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని ఆగ్రహించాడు. నాకే ఎదురుచెబుతావా? అనే బావనతో సదరు యాంకర్ విశ్వక్ సేన్ ని `గెట్ ఔట్ ఆఫ్ మై స్టూడియో` అంటూ అరిచింది.
దీంతో తననే స్టూడియోకు పిలిచి గెటౌట్ అంటావేంటి అని విశ్వక్ `F` అనే పదాన్ని వాడటం.. అది కాస్త దుమారంగా మారడం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏదైతే సినిమాపై సదరు టీవి ఛానల్ వివాదాన్ని సృష్టించిందో ఆ మూవీ విడుదలైంది. అర్జున్ రెడ్డి అంత కాకపోయినా విశ్వక్ సేన్ కోరుకున్న విజయాన్ని అందించింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అతన్ని విజేతని చేసింది. దీంతో నెటిజన్స్, ప్రేక్షకులు, అభిమానులు ఇప్పడు గెలిచింది ఎవరు? అంటూ ప్రశ్నలు సంధిస్తుండటం విశేషం. చెరపకురా చెడేవు అంటే ఇదే మరి.