ప్రస్తుతం బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లలో కూడా బయోపిక్ ల సీజన్ నడుస్తుంది. బయోపిక్ లకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి చేస్తే మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన పలు బయోపిక్ లు బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కొన్ని నిరాశ పర్చినా కూడా మంచి అనుభవాలను మాత్రం మిగిల్చాయి. అందుకే మరిన్ని బయోపిక్ లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ గురించిన చర్చలు జరుగుతున్నాయి.
విశ్వనాథ్ ఆనంద్ అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అందరికి ఆదర్శంగా ఉంటుంది. అలాంటి విశ్వనాథ్ ఆనంద్ గారి బయోపిక్ ఎందుకు తీయకూడదని చాలా మంది భావిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తన బయోపిక్ పై జనాల్లో ఉన్న ఆలోచనలు మరియు ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు. నా బయోపిక్ ను తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.
నా పాత్రను చేసేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు మాత్రమే ఛాన్స్ ఉందని అన్నాడు. చెస్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి మరియు ఆయన ఒక గొప్ప నటుడు అంటూ అమీర్ ఖాన్ పై విశ్వనాథ్ ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆయన ఒప్పుకుంటే నా బయోపిక్ వస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు కాకున్నా రాబోయే రెండు మూడు ఏళ్లలో అయినా విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటించేందుకు ఒప్పుకుంటాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సాహస పాత్రలు చేయడం అంటే అమీర్ ఖాన్ కు చాలా ఇష్టం. అందుకే ఆనంద్ పాత్రను అమీర్ ఖాన్ చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.