సింగర్ కేకే మరణానికి ముందు అసలేం జరిగింది.? సంచలన నిజాలు వెలుగులోకి?

Update: 2022-06-01 13:30 GMT
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. దాదాపు 3 దశాబ్ధాల పాటు పాటల ప్రపంచంలో రారాజుగా తన ప్రయాణాన్ని కేకే కొనసాగించారు. తెలుగులో అనేక అద్భుతమైన పాటలు పాడారు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. తాజాగా కోల్ కతాలో ఓ ఈవెంట్ లో పాల్గొని పాటలు పాడుతూ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు.

కేకే మరణం నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నాయి. ఆడిటోరియంలో విపరీతమైన వేడి ఉన్నట్లు కేకే చెబుతున్న వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. జనం కిక్కిరిసి ఉండడంతో చాలా వేడి పెరిగిపోయిందని కేకే నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

పాట పాడుతూ మధ్యలోనే ఆయన ఆగిపోయారు. బాడీ గార్డ్ లు వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మ్యూజిక్ షోలో కేవలం 2500 మంది మాత్రమే కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉందట. కానీ నిర్వాహకులు డబ్బుల ఆశకు కక్కుర్తి పడి 5వేల మందికి అనుమతిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కార్యక్రమాన్ని పద్ధతిగా నిర్వహించకపోవడంతో విపరీతమైన వేడి వాతావరణం ఏర్పడిందని.. ఈ సమ్మర్ హీట్ కు కేకే తట్టుకోలేకనే మరణించారని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రోగ్రాం జరిగిన కాసేపటికే తనకు ఆరోగ్యం బాగాలేదని హోటల్ కు కేకే వెళ్లిపోతున్నట్టు వీడియోలో రికార్డ్ అయ్యింది. తనకు ఉక్కపోత తీవ్రంగా ఉందని కంప్లైంట్ ఇచ్చిన వీడియో కూడా రికార్డ్ అయ్యింది.

కేకే మరణం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద ఈవెంట్ల నిర్వహణ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని.. సెలబ్రెటీలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ఆరోపించారు. అంత వేడి వాతావరణంలో ఆడిటోరియంలో ఏసీ ఆపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని.. వేడికి తట్టుకోలేకనే డీహైడ్రేషన్ అయ్యి కేకే మరణించారని ఆరోపించారు.


Full View
Tags:    

Similar News