RX 100 ద‌ర్శ‌కుడు ఇంత‌కీ ఏం చేస్తున్నాడు?

Update: 2023-01-11 03:36 GMT
తెర‌కెక్కించిన మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. RX 100 అత‌డికి ఊహించ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్. ఈ చిత్రంతో కార్తికేయ అనే హీరో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అత‌డు న‌టుడిగా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. కార్తికేయ‌తో పాటు పాయల్ రాజ్ పుత్ కూడా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మై క్రేజీగా అవ‌కాశాలు అందుకుంది.

కానీ అజ‌య్ భూప‌తి ఇంకా అక్క‌డే ఉన్నాడు. అత‌డి ద్వితీయ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. శర్వానంద్ - సిద్ధార్థ్ లతో అజయ్ తదుపరి మహాసముద్రం ఫ్లాప‌వ్వ‌డం త‌న‌ను తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌గా త‌న అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అప్ప‌టి నుంచి అజ‌య్ గ్రేట్ కంబ్యాక్ కోసం చాలా  త‌పిస్తున్నాడు. కానీ కొన్ని ప్ర‌య‌త్నాలు స‌రిగా సెట్ కాలేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు.

ఇటీవ‌లే సొంత బ్యానర్ ఎ క్రియేటివ్ వర్క్స్ ను ప్రారంభించాన‌ని అజ‌య్ భూప‌తి ప్రకటించారు. మునుముందు ఎలాంటి సవాళ్లకు అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. త్వ‌ర‌లోనే ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ త‌న నుంచి వెలువ‌డుతుంద‌ని కూడా టీజ్ చేసాడు.

2018 త‌ర‌వాత ఈ నాలుగేళ్ల‌లో..?

అయితే అజ‌య్ భూప‌తి త‌దుప‌రి ఏం చేయ‌బోతున్నాడు? అన్న‌దానికి ఇంకా స‌మాధానం రాలేదు. కార్తికేయతో అజయ్ భూపతి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రధానంగా జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్ తో అజయ్ ప్రొడక్షన్ హౌస్ క‌లిసి ప‌ని చేసేందుకు ఆస్కారం ఉందని క‌థ‌నాలొచ్చాయి. మ‌రోవైపు ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తోను అత‌డు టై అప్ అయ్యాడు. బెల్లంకొండ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీ‌నివాస్ కి శాటిలైట్ డిజిట‌ల్ బిజినెస్ ఘ‌నంగా ఉండ‌డం అత‌డికి ప్ల‌స్ కానుంది. అజ‌య్ భూప‌తి హిందీ సినిమా చేస్తున్నాడ‌న్న టాక్ ఉంది. కానీ దాని గురించి స‌రైన స‌మాచారం తెలియాల్సి ఉంది.

ఆర్.ఎక్స్ 100 హిందీలో ఆడిందా?

ఆర్‌.ఎక్స్‌ 100 చిత్రం 2018 జూలై 12 న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా హిందీలో 'తడప్' పేరుతో రీమేక్ చేశారు. 27 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌గా 54కోట్లు వ‌సూలు చేసింది. అక్క‌డా ఆర్.ఎక్స్ 100 క‌థ వ‌ర్క‌వుటైంది. ఆ క్రెడిట్ అజ‌య్ భూప‌తిదే. ఇక ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. శివ(కార్తికేయ) చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతాడు. డాడి (రాంకీ)నే తనకు సర్వస్వం. డాడీ కూడా శివను కన్నకొడుకులా చూసుకుంటాడు. ఆ ఊరి సర్పంచు విశ్వనాథం(రావు రమేశ్‌) వద్ద సహాయకుడిగా పనిచేస్తుంటాడు డాడి. విశ్వనాథం సర్పంచు అవ్వడానికి డాడినే మూలకారణం. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయిన విశ్వనాథం డాడికి ఇష్టంలేని పనులు కూడా చేస్తుంటాడు. విశ్వనాథం కూతురు ఇందు(పాయల్‌ రాజ్‌పుత్‌) శివను చూడగానే ఇష్టపడుతుంది.

ప్రేమించమని వెంటపడుతుంది. శివ కూడా ఇందును ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. వీరి ప్రేమ విషయం విశ్వనాథానికి తెలుస్తుంది. అప్పటికప్పుడు ఇందును మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లైన వెంటనే ఇందు అమెరికా వెళ్లిపోతుంది. ఈ షాక్‌ నుంచి శివ ఎలా తేరుకున్నాడు? ఇందు జ్ఞాపకాలు శివను ఎలా వేధించాయి? ఇందు మళ్లీ తిరిగి వచ్చిందా? లేదా? అన్నదే మిగిలిన కథ. ఈ సింపుల్ క‌థ‌ను అజ‌య్ భూప‌తి క‌మ‌ర్షియ‌ల్ గా తెర‌కెక్కించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. కానీ ఆ త‌ర్వాత మ‌హా ప్ర‌య‌త్నం చేసినా క‌మ‌ర్షియ‌ల్ హిట్ ని అందుకోలేక‌పోయాడు. కానీ హిందీలో త‌డాప్ విజ‌యం త‌ర్వాత అక్క‌డ ఒక సినిమా ఛాన్స్ ద‌క్కించుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News