'నీ స్నేహితులు ఎవరో చెప్పు .. నువ్వు ఎలాంటివాడివో నేను చెబుతాను' .. 'నీ పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పు .. నువ్వు ఎంతవరకూ సక్సెస్ అయ్యావనేది నేను చెబుతాను' అనే కొటేషన్లు విన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. ఏకాలంలోనైనా .. ఎవరి విషయంలోనైనా వర్తించే వాక్యాలు ఇవి. అనుభవంతో పెద్దలు చెప్పిన ఈ మాటలు ఆలోచింపజేస్తాయి. సాధారణంగా తల్లిదండ్రులంతా కూడా తమకంటే తమ పిల్లలను గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ల సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా పడతారు .. ఎన్ని త్యాగాలైనా చేస్తారు.
ఎంత ఎదిగినా తమ పిల్లలు చిన్నపిల్లలే అనుకుంటారు .. లోకం తెలియని అమాయకులే అనుకుంటారు. పిల్లల పట్ల వాళ్లకి గల ప్రేమానురాగాల కారణంగా అలా అనిపించడం సహజం. అందువల్లనే ప్రతి విషయంలోనూ వాళ్లకి సలహాలు .. సూచనలు ఇస్తుంటారు. పిల్లల కెరియర్ విషయంలో తల్లిదండ్రులు ప్రాణాలే పెట్టేస్తారు. వాళ్ల జీవితాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది పెద్దలు జీవితంలో తాము సాధించలేకపోయినవి తమ పిల్లలు సాధించాలని అనుకుంటారు. మరికొందరు వాళ్లకి ఏదైతే ఇష్టమో ఆ పని చేయడానికే ప్రోత్సహిస్తారు.
ఆ రెండవ వర్గానికి చెందిన వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా కనిపిస్తారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను నా పిల్లల కెరియర్ ను నా ఇష్టానికి తగినట్టుగా ప్లాన్ చేయలేదు. రహీమా .. ఖతీజా ఇద్దరూ కూడా వాళ్ల అభిరుచికి తగిన మార్గంలో ముందుకు వెళ్లడానికే ప్రోత్సహించాను. ఎప్పుడూ ఏ విషయంలోను ఎవరితోను పోల్చుకోవద్దు. మీకు ఏదైతే ఇష్టమో ఆ పనిని అంకితభావంతో చేయండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కుంగిపోకూడదు. ఒక పనిని తపస్సులా చేస్తే విజయం తప్పక సొంతమవుతుందనే చెప్పాను.
నేను నా కెరియర్ ను మొదలుపెట్టిన తరువాత నా వయసు వాళ్లతో పాటు, నాకంటే చాలా సీనియర్స్ తో కలిసి పనిచేశాను. ఎవరి టాలెంట్ వారిది .. ఎవరి ప్రత్యేకత వారిది. అందరి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది మాత్రం పని పట్ల నిబద్ధత. ఆ నిబద్ధతో పని చేయండి. జీవితంలో తప్పకుండా ముందుకు వెళతారు .. అనుకున్న గమ్యానికి చేరుకుంటారు" అనే చెప్పాను. అలాగే ఇద్దరూ కూడా తనకి ఇష్టమైన సంగీతాన్నే ఎంచుకున్నారు. పని విషయంలో ఇద్దరూ మొండివారే .. ది బెస్ట్ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటారు" అని చెప్పుకొచ్చారు.