స‌మంతపై చిట్టిబాబు కామెంట్ వెన‌క అంత‌రార్థం!

Update: 2021-12-30 16:30 GMT
మెగా దంప‌తులు రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ల‌కు స‌మంత మంచి స్నేహితురాలు అన్న సంగ‌తి తెలిసిందే. ఉపాస‌న‌తో స‌మంత చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. నాగ‌ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత ఓ వేడుక కోసం నేరుగా ఉపాస‌న ఇంటికే వెళ్లి అక్క‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఉపాస‌న‌-చ‌ర‌ణ్ జంట సామ్ తో ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యారో తెలిసిందే. తాజాగా స‌మంత గురించి రామ్ చ‌ర‌ణ్ ముందుకి ఆస‌క్తిక‌ర ప్రశ్న వెళ్లింది. మీ `రంగ‌స్థ‌లం` న‌టి స‌మంత గురించి మూడు మాట‌ల్లో చెప్పండి అంటే..చ‌ర‌ణ్ ఏమాత్రం మ‌రో ఆలోచ‌న లేకుండా ట‌కీమ‌ని ఇలా చెప్పేసారు.

`క‌మ్..బ్యాక్..స్ట్రాంగ్` అని స‌మంత గురించి చ‌ర‌ణ్ అన్నారు. దానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగులు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇదే విషయం స‌మంత దృష్టికి వెళ్లింది. సామ్ ఈ వీడియోని రీపోస్ట్ చేసి..అలాంటి మంచి మాట‌లు చెప్పినంద‌కు చ‌ర‌ణ్ కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. ఇలా ఒక‌రికి గురించి చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. చ‌ర‌ణ్ గురించి నాకు బాగా తెలుసు అని సామ్ మురిసిపోయింది. అయితే స్ట్రాంగ్ అన్న ప‌దం ఇప్పుడు హైలైట్ అవుతోంది. నాగ‌ చైత‌న్య తో విడాకుల త‌ర్వాత ఆమె ఎంత మ‌నోవేద‌న‌కు గురైందో ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్స్ పై ప్రత్య‌క్ష‌..ప‌రోక్షంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

చివ‌రికి అవ‌న్ని దాటుకుని త‌న పెయిన్ ని మ‌ర్చిపోయేందుకు వృత్తిగ‌తంగా ప్ర‌భావం ఏమాత్రం ప‌డ‌కుండా ఎంతో జాగ్ర‌త్త ప‌డింది. ప‌డి లేచిన కెర‌టంలా సామ్ మ‌ళ్లీ సినిమాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. ఇక చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్ లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మెట్రో న‌గ‌రాల్ని చుట్టేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సామ్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో అలా స్పందించారు. అలాగే స‌మంత‌-చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` చిత్రంలో జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిట్టిబాబు ప్రేమలో రామ‌ల‌క్ష్మిగా స‌మంత న‌ట‌న‌ను మ‌ర్చిపోలేం.
Tags:    

Similar News