మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం శుక్రవారం విడుదల అయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. తొలి రోజే 'ఉప్పెన' బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా రాబట్టిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే 'ఉప్పెన' సినిమా అంతా బాగానే ఉంది కానీ ఒక్క సీన్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
సినిమాలోని సెన్సిటివ్ పాయింట్ మీద ఒక సెక్షన్ ఆడియెన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ఉన్న అసలు విషయం అంతా డైవర్ట్ అయిపోయి.. సినిమా మీద నెగిటివిటీ వచ్చేసింది. అయితే ఇదే పాయింట్ ని కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ బాగా యాక్సప్ట్ చేస్తున్నారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయినా కూడా 'ఉప్పెన' చిత్రాన్ని చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. 'బాహుబలి' ని కట్టప్ప చంపుతాడు అని తెలిసినా.. ఎందుకు చంపాడనే పాయింట్ మీద జనాలు ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు 'ఉప్పెన' విషయంలో కూడా అలానే జరుగుతోంది. హీరోకి అలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.
ఏదేమైనా ప్రస్తుతానికి ఈ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. 100 శాతం సీటింగ్ ఆకుపెన్సీ కూడా రావడంతో ఈ సినిమాకు భారీగానే వీకెండ్ కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాకపోతే 'ఉప్పెన' టైటిల్ కార్డ్ పడకముందే త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతోందని చెప్పడం ఓ వర్గం ప్రేక్షకులను దూరం చేసే అవకాశం ఉందని అంటున్నారు.