రంగ‌మ్మ‌త్త‌ అన‌సూయ‌.. మ‌రి మంగ‌మ్మ‌?

Update: 2018-02-19 12:10 GMT
ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యాక‌... అన‌సూయ‌కు ల‌క్ బాగా క‌లిసొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అంత‌వ‌ర‌కు త‌లుపు త‌ట్ట‌ని సినిమా అవ‌కాశాలు... వ‌రుస‌గా తలుపు త‌డుతున్నాయి. ఇదిగో ఇప్పుడు రంగ‌స్థ‌లంలో కూడా ఆమెకు మంచి పాత్రే ద‌క్కింద‌ని, ఆమెపై పాట కూడా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

రంగ‌స్థ‌లం విడుద‌ల‌య్యే వ‌ర‌కు... ఎక్క‌డ చూసినా ఆ సినిమా గురించే చ‌ర్చ‌. అందులో పాట‌లు కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల‌వుతూ... అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేస్తున్నాయి. దేవి శ్రీ ప్ర‌సాద్‌... చెవుల‌ను క‌ట్టిప‌డేసే సంగీతాన్ని అందించాడు. ఎంత స‌క్క‌గున్నావే పాట దుమ్ము రేపేస్తోంది. త్వ‌ర‌లో రంగ‌మ్మ మంగ‌మ్మ పాట విడుద‌ల కాబోతోంది. ఇందులో రంగ‌మ్మ అంటే అన‌సూయ అని సులువుగానే అర్థ‌మైపోతోంది. ఎందుకంటే ఈ సినిమా ఆమె రంగ‌మ్మ‌త్త‌గా చేస్తున్న‌ట్టు ఎప్పటినుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మ‌రి పాట‌లో మంగ‌మ్మ ఎవ‌రు? అన‌సూయ లాగే మ‌రో క్యారెక్ట‌ర్‌ను కూడా పెట్టారా?

తెలిసిన స‌మాచారం వ‌ర‌కు... మంగ‌మ్మ అనే పాత్ర సినిమాలో లేద‌ట‌. కేవ‌లం ప్రాస కోస‌మే వాడార‌ట‌. క‌నుక పాట అన‌సూయ మీదేన‌ని అర్థ‌మైపోతోంది. ఈ పాట‌లో రామ‌ల‌క్ష్మి అదేనండి స‌మంత కూడా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఈ సినిమాలో మ‌రో ఐటెం సాంగ్ కూడా ఉంది. జిగేల్ రాణి అని సాగే పాట‌లో చెర్రీ, డీజే భామ పూజా హెగ్డే క‌లిసి డ్యాన్ ఆడారు. ఆ పాట కూడా విడుద‌ల కావాల్సి ఉంది.

రంగ‌స్థ‌లం పై సుకుమార్ ఓ రేంజ్ లో ఆశ‌లు పెంచుకున్నాడు. త‌న‌ను  మ‌ళ్లీ టాప్ డైరెక్ట‌ర్‌గా మార్చేస్తుంద‌ని ఆశిస్తున్నాడు. మార్చి 30న సినిమా విడుద‌ల కాబోతోంది.


Tags:    

Similar News