టాలీవుడ్ లో బయోపిక్స్ లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మహానటి ఎందరికో స్పూర్తినిచ్చిన మాట వాస్తవం. ఎన్టీఆర్ కథానాయకుడుకి అంకురార్పణ జరిగింది దాని వల్లే. అయితే మహానటి వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా దర్శకుడు నాగ అశ్విన్ ఇప్పటిదాకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిట్ కాలేదు. ఆ టైంలో చిరంజీవికి ఒక కథ రెడీ చేశాను అని చెప్పుకున్నాడు కాని అది కేవలం ప్రతిపాదన వద్దే ఆగిపోయింది. చిరు కూడా సైరా తర్వాత కొరటాల శివ-త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కమిటయిపోయాడు కాబట్టి ఏ యాంగిల్ లో చూసినా ఇద్హి ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదు.
అయితే తన దగ్గర కథలు చాలా ఉన్నాయని సెట్స్ పైకి వెంటనే వెళ్ళేలా కొన్ని సిద్ధం చేసుకున్నానని నాగ అశ్విన్ మహానటి ప్రమోషన్ టైం లోనే చెప్పాడు. అయితే తర్వాత ఏ హీరోనైనా కలిసినట్టు కాని కథను వినిపించినట్టు కాని ఎక్కడా సమాచారం లేదు. నాగ అశ్విన్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్ మేరకు తాను గతంలో సిద్ధం చేసుకున్న కథలన్నీ పక్కన పెట్టేసి నాగ అశ్విన్ కొత్తది రెడీ చేసుకుంటున్నాడని సమాచారం.
అయితే అది పూర్తయ్యాక ఎవరితో తీయాలని అప్పుడు డిసైడ్ చేస్తాడట. దీనికి టైం పట్టేలా ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి కోసం అశ్విన్ మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. మహానటి దర్శకుడిగా తను చేసే ఏ సినిమా అయినా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ ఒత్తిడిని తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే ఇవన్ని ఆలోచించే నాగ అశ్విన్ నిదానమే ప్రధానము సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు