రెండు రోజుల క్రితం పూరి జగన్ ఫుల్ అండ్ ఫైనల్ వర్షెన్ వినిపించారు.. సినిమా కత కత్తిలా ఉంది.. అంటూ ట్వీటేశాడు నితిన్. కట్ చేస్తే నిన్న రాత్రి ఆ సినిమాను చేయట్లేదని, ఫ్యూచర్‌లో మరో ప్రాజెక్టు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఒకానొక టైములో పూరి జగన్ సొంత ప్రొడక్షన్‌కు బాగా సహకరించి ''హార్ట్ ఎటాక్'' వంటి సినిమాను ప్రొడ్యూస్ చేసుకోవడానికి తోడ్పడిన నితిన్, ఇప్పుడు పూరికి ఇలా ఎందుకు హ్యాండ్ ఇచ్చాడనేదే అసలు టాపిక్.
నిజానికి ఈ విషయంపై రామ్‌గోపాల్ వర్మ ఏం చెబుతున్నాడంటే.. నితిన్ కంటే యూత్‌ఫుల్ హీరో కోసం వరుణ్ తేజ్‌ను తీసుకున్నాడు పూరి అని సెలవిచ్చాడు. అయితే నితిన్, వరుణ్ తేజ్ ఈక్వల్‌గానే ఉంటారు. ఒకరికి మెగా బ్యాక్‌డ్రాప్ ఉన్నా ఇంకొకరికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే నిన్న జరిగిన పరిణామాలు చూస్తే.. ముందుగా నితిన్ ఈ సినిమాను క్యాన్సిల్ చేశాడని, అప్పుడే పూరి వెంటనే మెగా ఫ్యామిలీని ఎప్రోచ్ అయ్యాడని చెప్పొచ్చు. అసలు నితిన్ ఎందుకు హర్టయ్యాడు?
ఒకవేళ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే విషయంలో ఏదైనా తేడా వచ్చిందా? మొన్ననే సి.కళ్యాణ్‌తో ''జ్యోతిలక్ష్మి'' సినిమాను తీసిన పూరి జగన్, ఛార్మికి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ప్రొడక్షన్‌లో పార్టనర్‌ను చేసేశారు.. ఇప్పుడు నితిన్‌ను కూడా అలాగే చేయమని అడిగారా? లేకపోతే ఛార్మి టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిపోయిన పూరి, నితిన్ ప్రక్కన మరోసారి 'శ్రీఆంజనేయం' హీరోయిన్‌ను యాక్ట్ చేయిస్తా అన్నాడా? లేకపోతే చిరంజీవి 150వ సినిమా ఉంది కాబట్టి.. ఈ సినిమాను స్క్రిప్టును ఏమన్నా ఫాస్ట్ ట్రాక్ చేసేసి తొందరగా చుట్టేయాలని అనుకున్నాడా పూరి?
తన కెరియర్ ఇప్పుడే ఒక సరైన ట్రాక్‌లో పడి, టాప్ ప్లేస్‌కు ఫాస్ట్‌గా దూసుకుపోతున్న వేళ ఒక కరెక్టు కుర్రాడు ఒక స్టార్ హీరోను వద్దనుకున్నాడంటే.. కారణంగా ఏదో బలంగానే ఉండుంటుంది. అథర్‌వైజ్, నితిన్ ఎందుకు వదిలేసుకుంటాడు?