వివాదాలని తనకు అనుకూలంగా మార్చుకుంటూ సరికొత్త వివాదాలని సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆయన కన్ను బాలీవుడ్ పై పడింది. సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజలుగా బాలీవుడ్ ని టీజ్ చేస్తూ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. స్టార్ హీరోలని సైతం టార్గెట్ చేస్తూ బంతాట ఆడుకుంటున్నారు.
ఇటీవల దక్షిణాది నుంచి విడుదలైన చిత్రాలు బాలీవుడ్ లో అది కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతున్నాయి. ఇటీవల విడుదలైన `కేజీఎఫ్ 2` హిందీ డబ్బింగ్ వెర్షన్ ఉత్తరాదిలో రికార్డుల మోత మోగిస్తోంది. తోలి రోజే అక్కడ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావించిన వర్మ `కేజీఎఫ్ 2` బాలీవుడ్ కు హారర్ సినిమాలా మారిందంటూ సంచలన కామెంట్ లు చేశారు. తాజాగా మరోసారి బాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. దక్షిణాదికి చెందిన తెలుగు, కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా సాధిస్తున్న రికార్డుల్ని చూసి బాలీవుడ్ మేకర్స్ , హీరోలు కుళ్లుకుంటున్నారంటూ మరో బాంబ్ పేల్చారు.
అంతే కాకుండా ఇటీవల బాలీవుడ్ ని ఏకేస్తూ వరుసగా సంచలన ట్వీట్ లు చేశారు. ప్రతీ ట్వీట్ లోనూ టార్గెట్ బాలీవుడ్,... బాలీవుడ్ హీరోస్... డైరెక్టర్స్.. మేకర్స్. బాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో ఏ ఒక్కరినీ వదలకుండా వర్మ ట్విట్టర్ లో చెడుగుడు ఆడేశాడు.
గత రెండు మూడు రోజులుగా అజయ్ దేవగన్, కన్నడ హీరో కిచ్చా సుదీప్ మధ్య భాషా పరమైన మాటల యుద్ధం నడిచింది. ఇదే అదనుగా భావించిన రామ్ గోపాల్ వర్మ సందెట్లో సడేమియా అంటూ మధ్యలో దూరేసి బాలీవుడ్ పై సెటైర్ల వర్షం కురిపించాడు. కేజీఎఫ్, పుష్ప. ట్రిపుల్ ఆర్ లు కేవలం హిందీ మాత్రమే కాదు తమిళ్, మలయాళ భాషల్లోనూ డబ్ చేశారు.
ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి వుంటుంది. వాళ్ల సినిమాకి ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ కావాలంటే అన్ని భాషల్లో విడుదల చేస్తారు. ఒకప్పటి హిందీ చిత్రాలు `మైనే ప్యార్ కియా`, హమ్ ఆప్కే హై కౌన్ నుంచి ఇటీవల విడుదల చేసిన `దంగల్` వరకు ఎన్నో హిందీ చిత్రాలను ఇతర భాషల్లో రిలీజ్ చేశారు. కానీ అవి ప్రాంతీయంగా సాధించిన వసూళ్లని ఇతర భాషల్లో రాబట్టలేకపోయాయి అని బాలీవుడ్ హీరోలకు, మేకర్స్ కు చురకలంటించారు వర్మ.
అంతటితో ఆగక ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు ఇటీవల బాలీవుడ్ లోనూ హిట్ అవుతున్నాయి. అంటే ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్ ను మాత్రమే చూస్తారు తప్ప అది ఏ భాష చిత్రం అన్న విషయం చూడరన్నది మరోసారి రుజువైంది.
దీన్ని గమనించి బాలీవుడ్, టాలీవుడ్ అని విభజించి చూడకుండా హీరోలు, దర్శకులు పోటీతత్వాన్ని స్వీకరిస్తే ప్రేక్షకులకు అన్ని రకాల చిత్రాలని అందించవచ్చు అన్నారు. ప్రభాస్, యష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ బాలీవుడ్ చిత్రాల్లో నటించినా అవి బ్లాక్ బస్టర్ లు అవుతాయి. అలా మీకు చేయడం సాధ్యమేనా?
రణ్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, జాన్ అబ్రహంలు టాలీవుడ్ లో సినిమాలు చేసి బాలీవుడ్ లో వసూలు చేసినంత సాధించగలరా? .. ఇదే మీకు నా ఛాలెంజ్` అంటూ ఏకి పారేశారు. అయితే టాలీవుడ్ మరీ ప్రధానంగా దక్షిణాది సినిమాలపై అక్కసుతో వున్న బాలీవుడ్ స్టార్స్ వర్మ ఛాలెంజ్ ని స్వీకరిస్తారా? .. ఆయన చెప్పినట్టే తెలుగులో సినిమాలు చేసి మన వాళ్ల రికార్డులని, వసూళ్లని అధిగమిస్తారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అది కుదిరే పని కాదని కొంత మంది మనోజ్ బాజ్ పాయ్ లాంటి విలక్షణ నటులే ఓపెన్ గా ఒప్పుకుంటుండటం విశేషం.