ఇటీవలే విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐదుగురు లేడీస్ ని తీసుకుని నాని తనదైన కామెడీ టైమింగ్ తో ఏదో మేజిక్ చేశాడన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ లో కొంత భాగం రీ షూట్ కు వెళ్తోందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. దాని ప్రకారం ఐదుగురు క్యారెక్టర్స్ మధ్య కొన్ని ఎపిసోడ్లు ఆశించిన విధంగా రాలేదని ఫైనల్ రష్ చూసుకున్నాక దర్శకుడు విక్రమ్ కుమార్ రీ షూట్ చేద్దామని చెప్పడంతో అవసరమైన పార్ట్ ని మళ్ళీ తీస్తున్నట్టు సమాచారం.
ఇది యూనిట్ అధికారికంగా చెప్పింది కాదు కానీ లీకైన న్యూస్ ని బట్టి ఇది నిజమే అని చెబుతున్న వారు లేకపోలేదు. ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ కు ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది. కానీ ఆగస్ట్ 30నే సాహో కూడా లాక్ కావడంతో మైత్రి సంస్థ వాయిదా వేయాలా వద్దా అనే సీరియస్ చర్చల్లో ఉంది. ఒకవేళ చేస్తే ఏ డేట్ బాగుంటుంది అనే దాని మీద కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఎలాగూ టైం దొరుకుతోంది కాబట్టి అవసరమైన రిపేర్లు ఇప్పుడే చేసుకుంటే బెటర్ కదా అనే అభిప్రాయం నిర్మాతల్లో ఉన్నట్టుగా తెలిసింది.
ఈ మధ్య మైత్రి సంస్థకు అంతగా కలిసి రావడం లేదు. సవ్యసాచి - అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత డియర్ కామ్రేడ్ సైతం అదే బాటలో నడవడం బ్రాండ్ పరంగా కొంచెం ఇబ్బందిగా మారింది. అది గ్యాంగ్ లీడర్ పూర్తిగా చెరపాలన్నది మైత్రి టార్గెట్. అసలే దీని బిజినెస్ టైంలో కామ్రేడ్ నష్టాల గురించి బయ్యర్లు ఎక్కడ కాంపెన్సేషన్ అడుగుతారోనని ఒకపక్క టెన్షన్ పడుతూనే మరోపక్క గ్యాంగ్ లీడర్ నిర్మాణాంతర వ్యవహారాలు కూడా త్వరితగతిన పూర్తి చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. మొత్తం గ్యాంగ్ లీడర్ టైటిల్ తో మొదలుకుని రిలీజ్ డేట్ దాకా టెన్షన్లు పెడుతూనే ఉందన్న మాట