వైఎస్ ఆర్ సెమీ బయోపిక్ 'యాత్ర' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూల విషయం పక్కన పెడితే వైఎస్ అభిమానులను ఈ చిత్రం పూర్తిగా సంతృప్తి పర్చడంతో పాటు, సాదారణ ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఉందంటూ రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.4 కోట్లను వసూళ్లు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్ షోల ద్వారా 71 వేల డాలర్లు - మొదటి రోజు 23.5 వేల డాలర్లను వసూళ్లు చేసింది. శని - ఆదివారాల్లో 'యాత్ర' ఓవర్సీస్ లో మరింతగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
మమ్ముటీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎక్కువ శాతం రాజశేఖర్ రెడ్డి 2003లో చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో సాగింది. కాంగ్రెస్ అధినాయకత్వంను ఎదిరించి మరీ పాదయాత్ర చేసి అధికారంను దక్కించుకున్న రాజశేఖర్ రెడ్డి ధైర్యంను దర్శకుడు మహి వి రాఘవ చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముటీ అద్బుతంగా నటించి మెప్పించాడు. తెలుగు రాష్ట్రాలు - ఓవర్సీస్ ల్లోనే కాకుండా మమ్ముటీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో కేరళ మరియు తమిళనాడులో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.
'యాత్ర'కు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే మొదటి వారంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే నమ్మకంను ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటున్న నేపథ్యంలో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో నడవడం ఖాయంగా కనిపిస్తోంది. 'యాత్ర'కు మరో వారం రోజుల పాటు పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో పాటు, వైఎస్ ఆర్ పై ఉన్న అభిమానంతో జనాలు సినిమాకు బ్రహ్మరథం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది.