సినిమాకు ఎంత కష్టమొచ్చిందో..

థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం అనేది ప్రేక్షకులకి పెద్ద ఆర్ధిక భారం ఉండేది కాదు.

Update: 2024-08-02 09:30 GMT

ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే 50 నుంచి 100 రోజులు వరకు మూవీస్ థియేటర్స్ లో కొనసాగుతూ ఉండేవి. ఫ్యాన్స్ తప్ప రెగ్యులర్ ఆడియన్స్ మూవీ రిలీజ్ అయిన వెంటనే చూసేయాలనే క్యూరియాసిటీతో ఉండేవారు కాదు. దీంతో కలెక్షన్స్ స్థిరంగా వచ్చేవి. అలాగే టీవీలలో కూడా సినిమాలు కనీసం 100 రోజుల తర్వాత మాత్రమే రిలీజ్ అవుతూ ఉండేవి. అయితే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్స్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత వరల్డ్ ప్రీమియర్స్ గా కొత్త సినిమాలని టీవీలలో ఫెస్టివల్స్ సమయాలలో రిలీజ్ చేసేవారు. సినిమాల శాటిలైట్ రైట్స్ కోసం కోట్ల రూపాయిలు వెచ్చించేవారు.

టీవీ ఛానల్స్ భారీగా పెట్టుబడి పెట్టేది కేవలం స్టార్ హీరోల సినిమాల మీదనే, లేదంటే థియేటర్స్ లో మౌత్ టాక్ తో సూపర్ సక్సెస్ అందుకున్న వాటిని కొనుగోలు చేసేవి. తరువాత 2020 నుంచి ఓటీటీలకి ఆదరణ పెరగడం మొదలైంది. అంతకు ముంది వరకు ఆడియన్స్ సినిమాలని అయితే థియేటర్స్ లో లేదంటే టీవీలలో మాత్రమే చూసేవారు. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ ఎప్పుడైతే వచ్చాయో టీవీ ఛానల్స్ కి క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. ఓటీటీలు ట్రెండింగ్ లోకి వచ్చాయి.

ఇక్కడే థియేటర్స్ లో సినిమాలకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు టికెట్ ధరలు 10, 20, 50, 70 రూపాయలలో నామమాత్రంగా ఉండేవి. థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం అనేది ప్రేక్షకులకి పెద్ద ఆర్ధిక భారం ఉండేది కాదు. అయితే ఓటీటీలలో కొత్త సినిమాలని 4 నుంచి 6 వరాల గ్యాప్ లోనే రిలీజ్ చేస్తున్నారు. వీలైనంతగా వేగంగా పెట్టిన పెట్టుబడి రికవరీ చేసుకోవాలని టికెట్ ధరల్ని అమాంతం పెంచేశారు. దీంతో సినిమా కేవలం స్టార్ హీరోల సినిమాలని మాత్రమే ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్న, మీడియం రేంజ్ మూవీస్ అయితే మౌత్ టాక్ బట్టి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. ఏవరేజ్ టాక్ వస్తే ఓటీటీలో వస్తుంది కదా అని లైట్ తీసుకుంటున్నారు. మారిన ప్రేక్షకుల ఆలోచనలతో సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్ప సినిమాలకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రావడం లేదు. ఇదే సమయంలో ఓటీటీలు కూడా తమ సబ్ స్క్రైబర్స్ ని స్థిరంగా ఉంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలని మాత్రమే ముందస్తుగా కొనుగోలు చేస్తున్నాయి. లేదంటే మౌత్ టాక్ తో సక్సెస్ అందుకున్నవాటిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.

ఏవరేజ్ టాక్ వచ్చిన సినిమాలని పర్సెంటేజ్ విధానాల్లో ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఆ చిత్రాలని ఓటీటీ ఛానల్స్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. దీంతో రిలీజ్ అవుతున్నట్లు కూడా డిజిటల్ ఆడియన్స్ కి తెలియడం లేదు. పర్సెంటేజ్ విధానంలో ఓటీటీలో రిలీజ్ అయిన నిర్మాతలకి ఆ సినిమాలతో పెద్దగా కలిసి రావడం లేదు. అలాగే వెబ్ సిరీస్ ల విషయంలో కూడా ఓటీటీ ఛానల్స్ ఇదే పంథాని ఫాలో అవుతున్నాయి. కేవలం ఛానల్ స్టాండర్డ్స్, సబ్ స్క్రైబర్స్ పెంచే సినిమాలు, వెబ్ సిరీస్ లని మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నాయి.

మిగిలిన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఎఫెక్ట్ నిర్మాతలపై పడుతుందనే మాట వినిపిస్తోంది. అటు థియేటర్స్ లో కలెక్షన్స్ రాబట్టుకోలేక ఇటు ఓటీటీలో కూడా ప్రేక్షకాదరణ పొందలేక, చాలా మంది నిర్మాతలు నష్టపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో పాటు ఓటీటీలో కూడా బాగా పాపులర్ అయిన మూవీస్, వెబ్ సిరీస్ చూసుకుంటే హిరామండి, మీర్జాపూర్ లాంటి సిరీస్ లు కనిపిస్తున్నాయి. సినిమాల పరంగా చూసుకుంటే హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటివి కనిపిస్తున్నాయి. అది కూడా నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద నెట్ వర్క్ ఉన్న ఓటీటీ ఛానల్స్ మాత్రమే రెగ్యులర్ గా వెబ్ సిరీస్ ల నిర్మాణం చేస్తున్నాయి. కొత్త కంటెంట్ లని రిలీజ్ చేస్తున్నాయి. మిగిలివాటిలో ఆశించిన స్థాయిలో కొత్త కంటెంట్ రావడం లేదనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News