టైసన్ నాయుడు.. ఎంత వరకు వచ్చిందంటే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరిగా 2021 అల్లుడు అదుర్స్ సినిమాతో తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Update: 2024-09-01 08:52 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరిగా 2021 అల్లుడు అదుర్స్ సినిమాతో తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీని తర్వాత హిందీలో ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ ఫ్లాప్స్ వలన తెలుగులో కొత్త ప్రాజెక్ట్ కి చాలా సమయం తీసుకున్నారు. ఫైనల్ గా గత ఏడాది సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

నిజానికి టైసన్ నాయుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిపోతుందని అందరూ భావించారు. ఎందుకనో షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. ఈ చిత్రంలో నేహా శెట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడీగా నటిస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా గురించి చాలా రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఫైనల్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మూవీ షూటింగ్ ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ చేశారు. టైసన్ నాయుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోందని, సూపర్ ఎగ్జైటెడ్ గా ఈ చిత్రీకరణ కొనసాగుతోందని బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీరు వింటారు. ఈ సినిమాని చూపించడానికి మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తర్వాత నేహా శెట్టి నుంచి రాబోతున్న సినిమా టైసన్ నాయుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే టైసన్ నాయుడు కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త దర్శకుడితో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. దాంతో పాటు అమరన్ చిత్రాన్ని విజయ్ కనకమేడల దర్శకత్వంలో రీమేక్ చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారంట. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత సాగర్ కె చంద్ర నుంచి టైసన్ నాయుడు సినిమా రాబోతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. మరి బెల్లంకొండ హీరో ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News