కంగ‌న Vs ఆలియా: జాతీయ ఉత్త‌మ న‌టి ఎవ‌రు?

న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించనున్నారు

Update: 2023-08-24 10:54 GMT

న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించనున్నారు. ఎప్ప‌టిలానే ఈసారి కూడా చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అధికారిక ప్రకటన కొద్దిసేప‌టిలో వెలువ‌డనుంది. అయితే ఈసారి 69వ‌ జాతీయ అవార్డుల రేసులో ఉత్త‌మ నటి ఎవ‌రు? అన్న ఆస‌క్తిక‌ర‌చ‌ర్చ నెటిజ‌నుల్లో కొన‌సాగుతోంది.

ఈ సంవత్సరం అలియా భట్ .. కంగనా రనౌత్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. గంగూబాయి కతియావాడిలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆలియా భ‌ట్.. తలైవిలో అమ్మ జ‌య‌ల‌లిత‌గా న‌టించిన కంగ‌న ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌నున్నారు. ఉత్త‌మ నటి కేట‌గిరీలో బ‌ల‌మైన‌ అభ్యర్థులు ఆ ఇద్ద‌రేన‌ని సోషల్ మీడియాల్లో డిబేట్ నిర్ధేశించింది. ఆస‌క్తిక‌రంగా.. ఆలియా అంటే కంగ‌న‌కు గిట్ట‌దు. బాలీవుడ్ మాఫియా రాజ్ మ‌హేష్ భ‌ట్ వార‌సురాలు అంటూ కించ‌ప‌రిచే కంగ‌న ప‌లుమార్లు మీడియా ఎదుటే తూల‌నాడింది.

అందుకే ఇప్పుడు అవార్డుల్లో ఆ ఇద్ద‌రి న‌డుమా వార్ గురించి ఆస‌క్తి నెల‌కొంది. ఆలియా, కంగ‌న ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా గొప్ప‌గా రాణించారు. ఫుల్ బిజీగా ఉన్నారు. బిడ్డ పుట్టాక ఆలియా కొంత గ్యాప్ తీసుకున్నా తిరిగి కంబ్యాక్ కోసం భారీ ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేసింది. కంగ‌న న‌టించిన ఎమ‌ర్జెన్సీ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిలింగా విడుద‌ల కానుంది.

సినిమాల ప‌రంగా చూస్తే.. మలయాళ చిత్రం నాయట్టు లేదా ఆర్ మాధవన్ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' కూడా పోటీ బ‌రిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నేటి సాయంత్రానికి దీనిపై అప్ డేట్ వెలువ‌డనుంది.

గ‌త అవార్డుల్లో సూర్య ది గ్రేట్

గత సంవత్సరం 2020 ఉత్తమ నటుడి అవార్డు 'సూరరై పొట్రు'కి సూర్య .. హిందీ చిత్రం 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' కోసం అజయ్ దేవగన్ మధ్య పంపిణీ జ‌రిగింది. నటి అపర్ణ బాలమురళి ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. మనోజ్ ముంతాషిర్ హిందీ చిత్రం 'సైనా'కి గాను ఉత్తమ సాహిత్యం అవార్డును గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్ 'మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్' అవార్డును గెలుచుకోగా, ఉత్తరాఖండ్ - ఉత్తరప్రదేశ్ ప్రత్యేక ప్రస్తావన గౌర‌వాన్ని పొందాయి.

కిశ్వర్ దేశాయ్ రచించిన 'ది లాంగెస్ట్ కిస్' సినిమాపై ఉత్తమ పుస్తకంగా పుర‌స్కారాన్ని గెలుచుకోగా, మలయాళ పుస్తకం 'ఎమ్‌టి అనునహ్వాంగులుడే పుస్తకం' .. ఒడియా పుస్తకం 'కలి పైనే కలిరా సినిమా' ప్రత్యేక ప్రస్తావన గౌర‌వాన్ని పొందాయి.

Tags:    

Similar News