'భగవంత్ కేసరి'.. అదే రేంజ్ లో బాక్సాఫీస్ జోరు!
మొత్తంగా తొమ్మిది రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.06కోట్లు షేర్, 119.51 గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి
దసరా విన్నర్‌గా నిలిచిన నటసింహాం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' ఇంకా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా ఆడుతోంది. విడుదలైన తొమ్మిది రోజులైనా ఇంకా రెస్పాన్స్ వస్తూనే ఉంది. సాలిడ్ కలెక్షన్స్‌తో ఆశ్చర్యపరుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు - విజయ్ లియో వంటి హై లెవెల్ బజ్ సినిమాలను అధిగమించి మరీ పైసలను అందుకుంటోంది.
చూస్తుంటే ఈ చిత్రం ఈ వారం పూర్తయ్యే లోగా లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 85 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసిందని బయటకు కథనాలు కనిపిస్తున్నాయి. తాజాగా తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందో వివరాలు బయటకు వచ్చాయి.
9 రోజుల్లో.. నైజాంలో రూ. 15.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.06కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.44 కోట్లు, గుంటూరులో రూ. 5.36 కోట్లు లక్షలు, కృష్ణాలో రూ. 3.01కోట్లు, నెల్లూరులో రూ.2.07 కోట్లు వచ్చాయని సమాచారం అందింది. ఇక కర్ణాకట, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ. 4.77 కోట్లు, ఓవర్సీస్ రూ.7.17కోట్లు వచ్చాయట.
మొత్తంగా తొమ్మిది రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.06కోట్లు షేర్, 119.51 గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే ఓపెనింగ్స్ గట్టిగా రావడంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అందించే విధంగా కొనసాగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ మ్యాజిక్ లోనే మంచి సెంటిమెంట్ కూడా జోడించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు ఎగబడుతున్నారు.
సినిమాలో బాలయ్యతో పాటు యంగ్ బ్యూటీ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. వీరి నటన కూడా అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమన్ అందించిన సంగీతం బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేశారు.