గ్లామరస్ భాగ్యశ్రీ.. తర్వాత ఏం చేస్తుందో?
భాగ్యశ్రీ భోర్సే.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ మరాఠీ బ్యూటీ.
భాగ్యశ్రీ భోర్సే.. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ మరాఠీ బ్యూటీ. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది అమ్మడు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ.. బాలీవుడ్ లోకి ఇప్పటికే యారియాన్ 2 సినిమాతో అడుగుపెట్టింది. అయితే తెలుగులో ఆమె నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే ఇక్కడ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది.
మిస్టర్ బచ్చన్ పూజ కార్యక్రమాలకు సంబంధించిన పిక్స్ బయటకు రాగానే.. కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లోకి చేరిపోయింది అమ్మడు. అయితే మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తుండగానే.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కు హీరోయిన్ గా భాగ్యశ్రీ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. శ్రీలీల తప్పుకోవడం వల్ల ఆమెను మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. నేచురల్ స్టార్ నానితో పాటు మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నట్లు టాక్.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మిస్ ఇండియా దివా భాగ్యశ్రీ భోర్సే. ఎక్కడ చూసినా ఆమె కోసమే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె లుక్సే. మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి రీసెంట్ గా 30 సెకండ్స్ మ్యూజిక్ ప్రోమో వచ్చిన విషయం తెలిసిందే. మంచి రెస్పాన్స్ దక్కించుకుని ఫుల్ వ్యూస్ తో దూసుకుపోతున్న ప్రోమోలో భాగ్యశ్రీ గ్లామరస్ లుక్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఆమె అందం, అభినయానికి ఫ్లాట్ అయ్యారు.
దీంతో టాలీవుడ్ కు అదిరిపోయే బ్యూటీ పరిచయం అవుతుందని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ హీరోల చిత్రాల్లో కూడా ఛాన్సులు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ జోస్యం చెబుతున్నారు.
అయితే ఇండస్ట్రీలో చాలా మంది బ్యూటీలు.. మొదట్లో తెరపై గ్లామరస్ గా కనిపించినా.. ఆ తర్వాత ఆ జోనర్ కు దూరం అవుతున్నారు. మరికొందరు ఏ రోల్ అయినా సరే చేయడానికి రెడీ అంటున్నారు. ఇంకొందరు హోమ్లిగా కనిపిస్తూనే గ్లామర్ రోల్ లో అదరగొడుతున్నారు. మరి భాగ్యశ్రీ.. అప్ కమింగ్ సినిమాల్లో ఎలాంటి రోల్స్ పోషిస్తుందో, తెలుగు డెబ్యూ మూవీతో ఎంతటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.