ఉన్నట్టుండి హీరో అదృశ్యం వెనక కారణం?
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ జర్నీ, వ్యక్తిగత జీవితం గురించి తెరిచిన పుస్తకం.
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కెరీర్ జర్నీ, వ్యక్తిగత జీవితం గురించి తెరిచిన పుస్తకం. ఇమ్రాన్ ఖాన్ తన బాలీవుడ్ ప్రయాణాన్ని 2008 చిత్రం `జానే తు యా జానే నా`తో ప్రారంభించాడు. ఆరంగేట్రం మెగా హిట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు, అభిమానులు జై (ఇమ్రాన్ ఖాన్ పాత్ర) అదితి (జెనీలియా డిసౌజా పాత్ర)ని ఎంతగానో ఇష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇమ్రాన్ కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి బాలీవుడ్ కి దూరమవ్వడం ఆశ్చర్యపరిచింది. అతడికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా అతడు బాలీవుడ్ లో పెద్ద హీరో అవుతాడని భావించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు జానే తు యా జానేనా సీక్వెల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కాఫీ విత్ కరణ్‌లో ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్‌ను విడిచిపెట్టడం గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతున్న పాత వీడియో వైరల్‌గా మారింది.
బాలీవుడ్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రయాణం చిన్నది కానీ ప్రభావవంతమైనది. తన తొలి సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఇమ్రాన్ సినిమాలను వదులుకుని కొంత విరామం తీసుకున్నాడు. త్వరలో మళ్లీ పెద్ద తెరపైకి రానున్నట్టు ఇటీవల ప్రకటించాడు. ఇంతలో రెడ్డిట్ వినియోగదారులు రణబీర్, ఇమ్రాన్ లకు చెందిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. అనూహ్యంగా ఇమ్రాన్ నిష్క్రమణ అభిమానులకు షాక్ ఇచ్చింది.
త్రోబ్యాక్ వీడియోలో ఇమ్రాన్ గురించి రణబీర్ ఇలా అన్నాడు. ``మీకు తెలుసా, అతడు కూడా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వదిలేసేవాడిలా కనిపిస్తున్నాడు. అతడు ఆసక్తి చూపకపోతే...?`` అని వ్యాఖ్యానించాడు.
రెడ్డిట్‌లో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ``సిద్ధార్థ్, అర్జున్, విక్కీ కౌశల్ వంటి నేటి సమకాలీనులతో పోల్చినప్పుడు అతడు చాలా తక్కువ కెరీర్‌లో ఎక్కువ హిట్‌లను కలిగి ఉన్నాడు! అని ఒకరు రాశారు. మానిఫెస్టేషన్ కౌచ్ తబీ సే చల్ రహా హై? అని వేరొకరు రాసారు. ఇమ్రాన్ కెరీర్ ని బాగా ప్రారంభించాడు.. ఇంకా అక్కడే ఉన్నాడు, కొన్ని ఘనమైన స్లీపర్ హిట్‌లు కానీ బౌన్స్ అయ్యాయి.. అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
సినిమాలను విడిచిపెట్టడం గురించి ఇమ్రాన్ గత ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. “నేను గతాన్ని ఎందుకు ఎక్కువగా చూస్తున్నాను అని మీరు ప్రశ్నిస్తే.. నేను నా చిత్రాలతో నా సంబంధాలను పునర్నిర్మించుకుంటున్నాను. స్పష్టంగా చెప్పాలంటే నేను దేనికీ ఎవరినీ నిందించను. అన్ని అభిప్రాయాలు నేను వినలేదు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో నేను ప్రతికూల మనస్తత్వం నుండి మాత్రమే జరుగుతున్న విషయాలను చూడగలిగాను`` అని వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యల్లో పశ్చాత్తాపం కనిపించింది. ఇమ్రాన్ ఖాన్ తన తప్పును గ్రహించినట్లు స్పష్టంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నేను నా తప్పును గుర్తించాను. బాధ కలిగించే మాటల గురించే నేను చాలా శ్రద్ధ వహించాను. ప్రేమించే స్వరాలకు నేను ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. ఎంత మూర్ఖుడిని. నేను మళ్ళీ ఆ తప్పు చేయను.. అని వ్యాఖ్యానించాడు. ఇమ్రాన్ ఖాన్ త్వరలో నటుడిగా తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో కలతలు ఉన్నాయి. అతడు ప్రేమించి పెళ్లాడిన తన భార్య అవంతిక నుంచి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు.