భయపెడుతున్న బూమరాంగ్ గ్లింప్స్
గ్లింప్స్ మాత్రం చూడ్డానికి చాలా భయంకరమైన విజువల్స్ తో టెర్రిఫిక్ గా ఉంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బీజీఎం గ్లింప్స్ లోని షాట్స్ ను మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది.
టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా బూమరాంగ్. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
అను ఇమ్మాన్యుయేల్ ఓ బిల్డింగ్ లోకి వెళ్లడం, అక్కడ ఎవరో ఉన్నారని తాను అనుకోవడం, ఆ బిల్డింగ్ లో ఉండే ఎంతో మందిని ఓ గుర్తు తెలియని రహస్య వ్యక్తి చంపాడని తెలుసుకున్న అను ఆ ఇంట్లో ఉండటానికి భయపడటంతో ఈ గ్లింప్స్ ముగుస్తుంది.
గ్లింప్స్ మాత్రం చూడ్డానికి చాలా భయంకరమైన విజువల్స్ తో టెర్రిఫిక్ గా ఉంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బీజీఎం గ్లింప్స్ లోని షాట్స్ ను మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. యూనిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా కర్మ థీమ్ తో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బిగ్ మూవీ మేకర్స్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ బాబు, ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తున్నారు.
ఇక అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికొస్తే, నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అను, కెరీర్ మొదటి నుంచే గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించాక అను ఇమ్మాన్యుయేల్ ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన కూడా ఛాన్స్ అందుకుంది. అను చివరగా తెలుగులో ఊర్వశివో రాక్షసివో సినిమాలో నటించింది.