బాక్సాఫీస్: నష్టాలతో ముంచేసిన టాప్ సినిమాలివే..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది కూడా ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది కూడా ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే అందులో కేవలం సగంలో సగం కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకురావడం లేదు. ఇక డబుల్ ప్రాఫిట్స్ అందించిన సినిమాలు అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక యావరేజ్ టాక్ వచ్చిన కూడా ఇటీవల కాలంలో అయితే చాలా సినిమాలు భారీ స్థాయిలోనే నష్టాలను మిగులుస్తున్నాయి.
ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. మినిమం కంటెంట్ గట్టిగా ఉంటేనే ఆడియన్స్ థియేటర్ల వరకు వస్తున్నారు. అయితే సక్సెస్ అయిన సినిమాల రికార్డుల కంటే కూడా దారుణంగా ప్లాప్ అయిన సినిమాలు అంతకంటే ఎక్కువ స్థాయిలో డిజాస్టర్ లలో రికార్డులను అందుకుంటున్నాయి.
ఇక బాలీవుడ్ అనలిస్టుల ప్రకారం అయితే ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమాల లిస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక అందులో మన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా టాప్ లిస్టులో ఉన్నట్లుగా చెబుతున్నారు. సినిమాలకు పెట్టుబడులు గట్టిగానే పెడుతున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా అయితే డబ్బులు వెనక్కి రావడం లేదు.
ఇక బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నాయి అని బాగానే హడావిడి చేశారు. కానీ ఆ సినిమా వలన దాదాపు 200 కోట్లు రేంజ్ లోనే నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ సినిమా నీకోసం 550 కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
అంటే దాదాపు 220 కోట్ల స్థాయిలో అయితే నష్టాలను కలిగించినట్లు సమాచారం. ఇక ప్రభాస్ కెరియర్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్ కాగా అలాగే పెట్టిన పెట్టుబడికి రాధే శ్యామ్ కూడా దాదాపు 170 కోట్ల వరకు నష్టాలు కలిగించింది. నార్త్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించాయి.
ఇక అందులో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా ద్వారా 140 కోట్లు నష్టం కలుగగా అలాగే షంషేరా సినిమా 100 కోట్ల వరకు పోగొట్టేసింది. ఇక తెలుగులో అయితే అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ద్వారా 80 కోట్ల వరకు నష్టాలు రాగా కన్నడ ఫిలిం కబ్జా అయితే 80 కోట్ల వరకు ముంచేసింది. ఇక అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చెడ్డ సినిమా 70 కోట్లు, తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా 60 కోట్ల వరకు నష్టాలను కలిగించింది.