శ్రీరెడ్డికి మొదలైపోయినట్లేనా?... కేసు నమోదు!
అవును... సినీనటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే హల్ చల్ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే.
సినీనటి, యూట్యూబర్ శ్రీరెడ్డి గురించి సినిమా, రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో! సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే వ్యాఖ్యలు, పెట్టే పోస్టులు, చేసే వీడియోలు చేసే రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా ఆమెపై పోలీసు కేసు నమోదైంది.
అవును... సినీనటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే హల్ చల్ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అటు సినీ నటులుపైనా, దర్శకులపైనా, రాజకీయ నాయకులపైనా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్లు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ సందర్భంగా ఆమె వాడే బాష, చేసే పదప్రయోగాలు తీవ్ర విమర్శలకు కారణమవుతుంటాయి.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై ఎన్నికల ముందు ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పలు వీడియోలు పోస్ట్ చేశారు!
వీటిపై తాజాగా కర్నూలుకు చెందిన టీడీపీ నాయకులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో... ఏ పార్టీ వారైనా సరే సోషల్ మీడియా వేదికగా స్పందిచేటప్పుడు నోటికి ఎది వస్తే అది కాకుండా.. కాస్త సెల్ఫ్ సెన్సార్ చేసుకుని (విజ్ఞత పాటిస్తూ, సంస్కారాన్ని అనుసరిస్తూ) మాట్లాడకపోతే ఇలానే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమనే దీమాతో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా శృతిమించిన విమర్శలు చేశారని అంటారు. అయితే... ఆమె అంచనా తప్పడం, వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడం తెలిసిందే.