శోభిత తో రామ్ చరణ్ క్రేజీ కాంబో!

ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమాలతో పాటు తన ఫ్రీ టైం లో పలు యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-12-21 10:51 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గానే మైసూర్లో ఓ భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమాలతో పాటు తన ఫ్రీ టైం లో పలు యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.


ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ కి సంబంధించిన యాడ్స్ లో నటించిన రామ్ చరణ్ తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఓ సరికొత్త యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్ షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలను బట్టి చూస్తే ఇదొక వెడ్డింగ్ కి సంబంధించిన యాడ్ అని తెలుస్తోంది. ఈ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల పెళ్లికూతురుగా ముస్తాబై పెళ్లి మండపంలో కూర్చుంది. ఆమెకు ఎదురుగా రామ్ చరణ్ పట్టు వస్త్రాల్లో పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించాడు.


రామ్ చరణ్, శోభిత వెడ్డింగ్ షూట్ పేరుతో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో రామ్ చరణ్ ని పెళ్లి కొడుకు గెటప్ లో చూసిన ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ లుక్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శోభిత దూళిపాళ్లతో కలిసి రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ చేస్తున్న యాడ్ షూట్ ఇది. అయితే ఈ యాడ్ బట్టలకు సంబంధించిందా? లేక ఆభరణాలకు సంబంధించిందా? అనేది తెలియదు.


శోభిత ధూళిపాళ్లతో రామ్ చరణ్ యాడ్ చేస్తున్నాడనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ యాడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక శోభిత ధూళిపాళ్ల విషయానికొస్తే.. టాలీవుడ్ లో అడివి శేష్ సరసన 'గూడచారి' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మేజర్, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం సౌత్ లో సినిమాలతో బిజీగా ఉన్న శోభిత అటు బాలీవుడ్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. రీసెంట్ గా హిందీలో వచ్చిన 'ది నైట్ మేనేజర్' అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శోభిత దూళిపాళ్ల స్టార్టింగ్ లో కొన్ని యాడ్స్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ఈ యంగ్ బ్యూటీ యాడ్ చేయడం విశేషం.

Tags:    

Similar News