డాకు మహారాజ్ బాక్సాఫీస్.. 4వ రోజు కూడా అదే జోరు
అలాగే సంక్రాంతి సెలవులు కూడా సినిమాకు అదనపు బలం అందించాయి.
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలవబోతున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ సందర్బంగా గ్రాండ్‌గా విడుదలైంది. బాలయ్య స్టామినా, బాబీ టేకింగ్, థమన్ మ్యూజిక్ ఈ సినిమాను మాస్ ప్రేక్షకులకు పండుగగా మార్చాయి. అలాగే సంక్రాంతి సెలవులు కూడా సినిమాకు అదనపు బలం అందించాయి.
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, బాలయ్య కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ఫ్యాన్స్‌ను అలరించే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్ ను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టాయి. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు కూడా సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గట్టి హోల్డ్ చూపించింది.
4వ రోజు వచ్చిన షేర్
నైజాం – 1.47 కోట్లు
సీడెడ్ – 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.23 కోట్లు
గుంటూరు – 0.53 కోట్లు
కృష్ణ – 0.57 కోట్లు
తూర్పు గోదావరి – 0.72 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.45 కోట్లు
నెల్లూరు – 0.28 కోట్లు
ముఖ్యంగా నైజాంలో రూ. 1.47 కోట్ల షేర్, సీడెడ్‌లో రూ. 1.20 కోట్ల షేర్, విశాఖపట్నంలో రూ. 1.23 కోట్ల షేర్ నమోదు చేయడం విశేషం. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో కూడా సినిమా మంచి వసూళ్లను సాధించింది.
ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 45 కోట్ల షేర్‌ను రాబట్టింది. ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరగడానికి అవకాశముంది. బాలయ్య మాస్ ఇమేజ్, బాబీ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. సంక్రాంతి సెలవుల ప్రభావంతో సినిమా వసూళ్లు ఇంకా స్ట్రాంగ్‌గా కొనసాగుతుండటం గమనార్హం. మరింతగా తెలుగు రాష్ట్రాల్లో రన్ కొనసాగించి, ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నాలుగు రోజుల ఏపీ తెలంగాణ టోటల్ కలెక్షన్లు (షేర్):
నైజాం: రూ. 10.15 కోట్లు
సీడెడ్: రూ. 9.87 కోట్లు
విశాఖపట్నం: రూ. 5.68 కోట్లు
తూర్పు గోదావరి: రూ. 4.16 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ. 3.18 కోట్లు
కృష్ణా: రూ. 3.72 కోట్లు
గుంటూరు: రూ. 5.89 కోట్లు
నెల్లూరు: రూ. 2.49 కోట్లు
మొత్తం నాలుగు రోజులు: రూ. 45.14 కోట్లు (షేర్)