శ్రీలీలతో డాన్స్.. ఆ ఇద్దరు హీరోలే కరెక్ట్ పోటీ

ఈ ఏడాది ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది.

Update: 2024-01-11 00:30 GMT

టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. గత ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ సినిమాలతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఇప్పటికే టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా శ్రీలీలకి మంచి పేరు వచ్చేసింది. సాయి పల్లవి తర్వాత ఆమెకి సమానమైన స్థాయిలో డాన్స్ చేయగలిగే హీరోయిన్ గా ఈ అమ్మడి అందరూ కితాబు ఇచ్చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన డాన్స్ టాలెంట్ తో ఆడియన్స్ ని శ్రీలీల ఎంటర్టైన్ చేస్తోంది. ఇక గుంటూరుకారం సినిమాలో కూడా శ్రీలీల, మహేష్ బాబు మధ్య మంచి డాన్స్ బీట్స్ ఉన్న డ్యూయెట్స్ ఉన్నాయి.

తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు శ్రీలీల డాన్స్ పై ప్రశంసలు కురిపించాడు. చాలా కాలం తర్వాత ఒక తెలుగు హీరోయిన్ స్టార్ ఇమేజ్ తెచ్చుకొని దూసుకుపోతోందని కొనియాడారు. అలాగే శ్రీలీల డాన్స్ మామూలుగా లేదని, ఆమెతో డాన్స్ చేయాలంటే హీరోలకి తాట ఊడిపోవాల్సిందే అంటూ ప్రశంసలు కురిపించాడు.

మహేష్ బాబు మొదటిసారి ఒక హీరోయిన్ డాన్స్ గురించి ఇంతలా ప్రశంసించారని చెప్పాలి. శ్రీలీలతో సమానంగా డాన్స్ చేయగలిగే సత్తా టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కి మాత్రమే ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఆమె స్పీడ్ ని మ్యాచ్ చేయగలిగే రేంజ్ లో వారి డాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఆ ఇద్దరు హీరోలతో శ్రీలీల జత కడితే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయితే వారికి జోడీగా అవకాశం రావడం పెద్ద కష్టమేమీ కాదనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాపై ఎలాగూ పాజిటివ్ టాక్ ఉంది. మూవీ బ్లాక్ బస్టర్ పడితే కమర్షియల్ హీరోయిన్ గా శ్రీలీల రేంజ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమాలు ఎలాగూ ప్రొడక్షన్ కి సిద్ధం అవుతున్నాయి. అందులో గ్యారెంటీగా సెలక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. తారక్ తో మూవీ చేయాలంటే మాత్రం కొన్నేళ్ళు ఎదురుచూదాల్సిందే.


Tags:    

Similar News