రాబిన్‌హుడ్ టీమ్ అదిరిపోయే ప్లాన్.. ప్రమోషన్స్ కు వార్నర్
నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.;
నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 28న రాబిన్‌హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబిన్‌హుడ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మూవీ లవర్స్ తో పాటూ క్రికెట్ ఫ్యాన్స్ కూడా వార్నర్ సినీ రంగ ప్రవేశంపై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆడియన్స్ ఉత్సాహాన్ని ఇప్పుడు మరింత పెంచేశాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. మంగళవారం ఏర్పాటు చేసిన రాబిన్‌హుడ్ ప్రెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపాడు వెంకీ.
రాబిన్‌హుడ్ లో డేవిడ్ వార్నర్ పాత్ర చిన్నదైనా ఆయన నటించేందుకు ముందుకొచ్చి చేశారు. దానికి ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలన్న వెంకీ త్వరలోనే వార్నర్ కూడా మూవీ ప్రమోషన్స్ కు రానున్నట్టు తెలిపాడు. ఫ్యాన్స్ ను కలవడానికి వార్నర్ చాలా వెయిట్ చేస్తున్నాడని చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
రాబిన్‌హుడ్ టీమ్ వార్నర్ తో డిఫరెంట్ గా ఎలా ప్రమోషన్స్ చేయిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టు గా వార్నర్ వస్తాడేమో అని కొందరంటుంటే, మరికొందరు ఆయనతో కలిసి మూవీ టీమ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ సినిమాను ప్రమోట్ చేస్తారేమో అని కామెంట్ చేస్తున్నారు.
ఇక వార్నర్ విషయానికొస్తే ఆయన క్రికెట్ తోనే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో చాలా ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్ కు తాను పెద్ద ఫ్యాన్ అంటూ ఎన్నోసార్లు చెప్పిన వార్నర్ పుష్ప డైలాగ్స్ తో చాలానే రీల్స్ చేశాడు. బన్నీ కూడా ఆయన రీల్స్ కు పలు సందర్భాల్లో రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. గ్రౌండ్‌లో కూడా వార్నర్ చాలా సార్లు తగ్గేదేలే అంటూ పుష్ప మ్యానరిజమ్స్ చేసి అలరించాడు. ఇప్పుడు డైరెక్ట్ గా వార్నర్ తెలుగు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం అందరికీ మంచి కిక్ ఇస్తుంది. మరి రాబిన్‌హుడ్ తర్వాత కూడా వార్నర్ సినిమాల్లో నటిస్తాడా లేక ఈ మూవీ సరదాగా చేశాడా అనేది తెలియాల్సి ఉంది.