పవర్ స్టార్ వారసుణ్ణి వదలని ఏఐ కేటుగాళ్లు!
లేదంటే అందులో ఉంది నిజంగా ఆ హీరోయిన్ అనుకునే ప్రమాదం స్పష్టంగా ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సినిమా రంగానికి చేసే మేలు కంటే కీడే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే హీరోయిన్లు ఏఐతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో బట్టబయలైంది. ఏఐ టెక్నాలజీ మార్పింగ్ వీడియోలతో అందులో ఉంది మా ఫేస్ కాదుని మీడియా ముందుకొచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి . లేదంటే అందులో ఉంది నిజంగా ఆ హీరోయిన్ అనుకునే ప్రమాదం స్పష్టంగా ఉంటుంది.
ఇదే టెక్నాలజీతో సినిమాకి సంబంధించిన లీకులు అలాగే జరుగుతున్నాయి. ఇటీవలే 'దేవర' లో ఆయుధ పూజ సాంగ్‌ని కొంత మంది ఏఐ సాయంతో ఓ 25 సెకన్ల బిట్‌ను లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అది నెట్టింట వైరల్ అయింది. తాజాగా ఏఐ కేటుగాళ్లు సెలబ్రిటీల్నే కాదు వారి పిల్లల్ని సైతం టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ పేరుతో ఓ పేక్ వీడియో పోస్ట్ చేసారు.
అఖీరా లుక్స్‌ను ఎన్‌హాన్స్ చేసి.. డీసెంట్‌గా ప్రజెంట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కొత్తగా ఇదో రకమైన సమస్యగా మారింది ఇండస్ట్రీలో. ఇప్పటివరకూ హీరోలు, సినిమాలో సీన్లే అనుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ వారసత్వంపై కూడా ఏఐ ద్వారా కేటుగాళ్లు కన్నేసినట్లు కనిపిస్తుంది. మును ముందు ఇంకా ఎలాంటి ఘోరాలకు తెగబడతారో? ఇప్పటికే ఏఐ ఇండస్ట్రీకి మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇండస్ట్రీలో చాలా మందికి పని ఉండదని అంటున్నారు. అందువల్ల ఏఐ కి సినీ పరిశ్రమ దూరంగా ఉంటేనే ఉత్తమం అని చెబుతున్నారు. అయితే ఏఐ చిన్న సినిమాల నిర్మాణం ఖర్చు తగ్గుతుంది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేని నిర్మాతలు ఏఐ సహాయంతో తమకు కావాల్సిన విధంగా కొన్ని రకాల సౌకర్యాలు పొందొచ్చు.