విజయ్, రష్మిక ఒకే ఇంట్లో..? ఇదిగో సాక్ష్యం..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి

Update: 2023-09-07 05:47 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గీతా గోవిందం సినిమాతో వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని, అందుకే రష్మిక తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రెడ్ మూవీలో నటించారు. అప్పటి నుంచి వీరి బంధం మరింత బలపడిందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.

అంతేకాదు, వీరు తరచూ ట్రిప్ లకు కూడా కలిసి వెళ్తున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని రూమర్స్ వచ్చినా వారిద్దరూ మాత్రం ఏ రోజు ఈ వార్తలపై స్పందించలేదు. అయితే, తాజాగా రష్మిక, విజయ్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని, సహజీవనం చేస్తున్నారని మరోసారి వార్తలు రావడం మొదలయ్యాయి.

దానికి నెటిజన్లు ఫ్రూఫ్ లు కూడా చూపిస్తున్నారు. ఇటీవల రష్మిక తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మెరిసిపోయింది. ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత ఆ చీరలో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అయితే, ఆ ఫోటోలు దిగిన లొకేషన్ లో గతంలో విజయ్ దేవర కొండ కూడా సేద తీరుతూ ఫోటోలు షేర్ చేశారు.

ఇద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ లో ఉండటంతో, వీరిద్దరూ కలిసే ఉంటుున్నారు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. వారిద్దరి ఫోటోల పక్కపక్కనే పెట్టి మరీ ఇదిగో సాక్ష్యం అంటూ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై విజయ్, రష్మికలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు ఇటీవల ఖుషీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తనకు పెళ్లి, వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉంది అంటూ చెప్పాడు. దీంతో, ఇంకేముంది వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. మరి వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తుందో లేదో చూడాలి. ఇక, విజయ్ రీసెంట్ ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక పుష్ప, యానిమల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News