దేవి నాగవల్లి మరో యూ టర్న్
ఇకపై నాగవళ్లి.. సినీ ఇండస్ట్రీలో బిజీగా గడపనున్నారని, అందుకే మీడియాకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా చిత్రసీమలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
సంపాదించుకున్నారు. ఎప్పుడు ముక్కుసూటిగా క్వశ్చన్ చేస్తుంటారు.. ఆన్సర్ ఇస్తుంటారు.. కొన్నిసార్లు వివాదాల్లో కూడా నిలుస్తుంటారు!
అయితే నాగవళ్లి.. బిగ్ బాస్-4 హౌస్ లోకి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 22 రోజుల పాటు హౌస్ లో ఉన్న ఆమె.. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యారు. అనంతరం మళ్లీ మీడియాలోనే కంటిన్యూ అయ్యారు. అలా మొత్తానికి జర్నలిజం ఫీల్డ్ లో దేవి నాగవల్లి.. తనకంటూ మంచి అనుభవం, పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పాలి.
ఇప్పుడు ఆమె తాను వర్క్ చేసిన మీడియా ఛానల్ కు గుడ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆమెకు సహోద్యోగులు ఫేర్ వెల్ ఇచ్చిన వీడియోస్ అండ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆల్ ది బెస్ట్ అని రాసిన ఉన్న కేక్ ను కట్ చేసిన దేవి నాగవల్లి.. ఎమోషనల్ అయ్యారు. తన కొలీగ్స్ అందరితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు.
అయితే ఇకపై నాగవళ్లి.. సినీ ఇండస్ట్రీలో బిజీగా గడపనున్నారని, అందుకే మీడియాకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా చిత్రసీమలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప-2కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియాలో తెలిపారు.
టైటిల్ కార్డ్స్ లో నాగవల్లి పేరును కూడా సుకుమార్ వేశారు. పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీలో ఇసుక రవ్వంత పని చేస్తే సుకుమార్ కొండంత గుర్తింపు ఇచ్చారని నాగవల్లి కొనియాడారు. మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం తన అదృష్టమని తెలిపారు. ఎంతో ధైర్యమిచ్చారని చెప్పారు. సుకుమార్ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు.
దీంతో ఇప్పుడు దేవి నాగవల్లి.. సుకుమార్ శిష్యురాలిగా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సుక్కూ శిష్యులు అనేక మంది అడుగుపెట్టి మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె ఇంకొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారని మరో టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో నిజమేదో నాగవల్లి స్పందిస్తే కానీ తెలియదు.