అమీర్ తో గజిని 2.. సూర్య ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఇప్పటికే డీఎస్పీ మ్యూజిక్ తో తండేల్ పై సూపర్ బజ్ ఏర్పడగా ట్రైలర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Update: 2025-02-01 03:30 GMT

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తండేల్ హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గజిని 2 కి సంబంధించిన హింట్ ఇచ్చేశారు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాను తెలుగుతో పాటు అన్ని సౌత్ భాషలు ఇంకా హిందీలో కూడా ఒకే డేట్ న రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ నేషనల్ వైడ్ అంతటా ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే డీఎస్పీ మ్యూజిక్ తో తండేల్ పై సూపర్ బజ్ ఏర్పడగా ట్రైలర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

తండేల్ హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగగా ఈ ఈవెంట్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. నాగ చైతన్యతో లాల్ సింగ్ చద్దా చేయడమే కాకుండా అల్లు అరవింద్ తో గజిని సినిమా కూడా చేశారు అమీర్ ఖాన్. ఆ రిలేషన్ కొద్దీ అమీర్ ఖాన్ తండేల్ సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ఈవెంట్ లో అల్లు అరవింద్ తన ఎల్డర్ బ్రదర్ అని అమీర్ చెప్పడం వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియచేసింది.

ఇక అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ అమీర్ తో తనకు 1000 కోట్ల సినిమా చేయాలని ఉందని అన్నారు. అది గజిని 2 అయినా కావొచ్చు అన్నట్టుగా హింట్ ఇచ్చారు. గజిని అనగానే సౌత్ ఆడియన్స్ అందరికీ సూర్య గుర్తొస్తాడు. ఆ సినిమాను హిందీలో అల్లు అరవింద్ నిర్మించారు. ఐతే రజిని 2 గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు ఆమధ్య గజిని 2 అమీర్ ఖాన్ తోనే కాదు అందులో సూర్యని కూడా భాగం చేస్తారని వార్తలు వచ్చాయి.

ఐతే ఇప్పుడు అల్లు అరవింద్ కామెంట్స్ చూస్తే కేవలం అమీర్ ఖాన్ తోనే గజిని 2 చేసేలా ఉన్నారని అనిపిస్తుంది. అలా జరిగితే మాత్రం సూర్య ఫ్యాన్స్ కచ్చితంగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ గజిని 2 మీద సూర్య ఆలోచన ఏంటి.. ఒకవేళ అల్లు అరవింద్ చేద్దామంటే సూర్య ఓకే అంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అమీర్ ఖాన్ మాత్ర అల్లు అరవింద్ ఎప్పుడు ఓకే అన్నా సరే ఆయన రెడీ అన్నట్టే కనిపిస్తున్నారు.

Tags:    

Similar News