పుష్ప 2 బిజినెస్.. RRRను కొట్టేసిందా?

'పుష్ప2' మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 270 కోట్లకి కొనుగోలు చేసిందంట.

Update: 2024-09-16 12:04 GMT

డిసెంబర్ 6న టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘పుష్ప’ మూవీ సక్సెస్ కారణంగా ‘పుష్ప 2’పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మూవీ రిలీజ్ వాయిదా పడుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాపై జరుగుతున్న బిజినెస్ డీల్స్ అందరికి షాక్ ఇస్తున్నాయి. ఎవ్వరి అంచనాలకి అందని స్థాయిలో భారీ ధరకి ‘పుష్ప 2’ మూవీ థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని టాక్ వస్తోంది.

‘పుష్ప2’ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 270 కోట్లకి కొనుగోలు చేసిందంట. ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ డీల్ ఏ సినిమాకి జరగలేదు. కేవలం ‘పుష్ప 2’ మీద ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్ యాజమాన్యం భారీ ధర చెల్లించి ఈ సినిమా ఓటీటీ హక్కులని సొంతం చేసుకుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ మరో రేర్ ఫీట్ ని కూడా అందుకుందని తెలుస్తోంది.

ఈ సినిమాపై ఏకంగా 550 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగిందంట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి ఈ స్థాయిలో థీయాట్రికల్ బిజినెస్ జరగలేదు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కి అత్యధికంగా 500 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ‘బాహుబలి’ సిరీస్ సక్సెస్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి భారీ స్థాయిలో డిస్టిబ్యూటర్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక ధరలకి రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్స్, బయ్యర్లు అందరికి కూడా మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేసిందని టాక్ అయితే వస్తోంది. 550 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 560+ కోట్ల షేర్ ని థియేటర్స్ లో అందుకోవాల్సి ఉంటుంది. సుకుమార్ క్రియేటివ్ రైటింగ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కచ్చితంగా ‘పుష్ప 2’కి భారీ కలెక్షన్స్ తెచ్చి పెడతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ అంచనాలను రెట్టింపు చేశాయి. డిసెంబర్ 6న రాబోయే ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సినిమాపై ఇదే హైప్ కొనసాగితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News