సుధీర్ బాబు పాన్ ఇండియా.. ముంబైకు నవ దళపతి

సినిమా యావరేజ్ గా ఉన్నా.. సుధీర్ బాబు మాత్రం యాక్షన్ తో మంచి పేరు సంపాదించుకున్నారు.

Update: 2024-07-14 13:25 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్య‌మైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. ఇటీవల హరోం హర మూవీతో పలకరించారు. సినిమా యావరేజ్ గా ఉన్నా.. సుధీర్ బాబు మాత్రం యాక్షన్ తో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈ సినిమాతో నవ దళపతిగా మారిన సుధీర్ బాబు.. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా లెవెల్ లో మూవీ చేయనున్నారు. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇటీవల వచ్చింది. వెంట కళ్యాణ్.. ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. బాలీవుడ్ కు చెందిన ఓ బ్యూటీ.. హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది.

సెప్టెంబర్ లో ఈ సినిమా షూట్ మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు ప్రకటించారు. ఫ‌స్ట్ లుక్‌ ను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తామని కూడా వెల్లడించారు. అందులో భాగంగా పోస్టర్ షూట్ కోసం తాజాగా సుధీర్ బాబు ముంబై చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సింపుల్ గా ట్రౌజర్, టీ షర్ట్ వేసుకున్న సుధీర్ బాబు.. క్లీన్ షేవ్ తో ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో మూవీ కోసం ఆయన అలా క్లీన్ షేవ్ తో మేకోవర్ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు ఉందని చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు. వినూత్న కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైల్ స్టోన్ గా నిలవనుందని అని చెప్పడంతో ఇప్పటి నుంచే మూవీపై అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ లో రుస్తుం, టాయ్‌లెట్‌ : ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి.. లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ప్రేర‌ణ అరోరా.. సుధీర్ బాబు పాన్ ఇండియా మూవీని రూపొందించనున్నారు. శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News