AAA సినిమాస్ తర్వాత అల్లు బాస్ సరికొత్త ఆవిష్కరణ?
మారుతున్న వినోద రంగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల వ్యవస్థ గొప్పగా అభివృద్ధి చెందుతోంది.
సాంకేతికంగా ప్రపంచం చాలా ముందుకు వెళుతోంది. డిజిటల్ వరల్డ్ లో ఏదైనా సాధ్యమేనని నిరూపితమవుతోంది. ఇటీవల ఏఐ - చాట్ జీపీటీ సాంకేతికత మరింతగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం సినిమా రంగంలోను భారీ మార్పులను తెస్తోంది. మారుతున్న వినోద రంగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల వ్యవస్థ గొప్పగా అభివృద్ధి చెందుతోంది.
ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు అధునాతన స్క్రీన్‌లు, అత్యున్నతమైన సౌండ్ సిస్టమ్‌లు, అత్యాధునిక విజువల్ సాంకేతికతతో కూడిన విలాసవంతమైన మల్టీప్లెక్స్‌లలో సినిమాలను ఆస్వాధిస్తున్నారు. అలాగే థియేటర్లలో అల్ట్రా థిన్ సౌండ్ ని విని ఆస్వాధించేలా సాంకేతికత ఎదిగింది. మారుతున్న ట్రెండ్ ని అనుసరించి.. హైదరాబాద్‌లోని సినీ ఔత్సాహికులు దీనికి మినహాయింపు కాదు. నగరంలో మల్టీప్లెక్స్ రంగం పీక్స్‌లో ఊపందుకుంది. ఏటేటా కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం జరుగుతోంది.
ఇప్పటికే హైదరాబాద్ లో అనేక మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. పలువురు టాలీవుడ్ స్టార్లతో కలిసి ఏసియన్ సినిమాస్ సంస్థ భారీ మల్టీప్లెక్సులను నిర్మిస్తోంది. ప్రఖ్యాత ఏసియన్ సినిమాస్ స్క్రీన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రసాద్స్ IMAX సహా ఏఎంబి మాల్, ఏఏఏ సినిమాస్ హై క్లాస్ ఫెసిలిటీస్, అధునాతన సాంకేతికతతో ప్రజల్ని థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఇంతలోనే హైదరాబాదీలను ఎగ్జయిట్ చేసే మరో ఆసక్తికర వార్త అందింది.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో డాల్బీ విజన్-ఎక్విప్‌డ్ సినిమా డెవలప్‌మెంట్ ప్లానింగ్ లో ఉందని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ఈ సాంకేతికతను పరిచయమవుతుందని తెలిపారు. సినీప్రియులకు ఇది నిజంగా ఆనందం కలిగించే వార్త. కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే తేదీ సహా ఇతర వివరాలు మునుముందు వెల్లడి కానున్నాయి. ఓవైపు గజినీకి సీక్వెల్ నిర్మించేందుకు అల్లు బాస్ తీవ్రమైన ప్రణాళికల్లో ఉన్నట్టు కథనాలొస్తున్నాయి. సైమల్టేనియస్ గా సూర్య, అమీర్ ఖాన్ లతో సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే అరవింద్ మరో సంచలనాత్మక నిర్ణయంతో వినోద ప్రియుల్లో చర్చనీయాంశంగా మారారు.