బాహుబలితో జాట్.. ఇది గమనించారా?
ఇక ఈ ఫ్రేమ్ లో మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ప్రభాస్ వేల కోట్ల బిజినెస్ కలిగిన హీరో అయినప్పటికీ ఒక సీనియర్ ముందు చేతులు కట్టుకొని స్టిల్ ఇవ్వడం నిజంగా గ్రేట్.;

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కాంబినేషన్ లో జాట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపొందుతున్న జాట్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేని తీసిన పలు మూవీ హిట్ కావడంతో.. జాట్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ గుడ్ రెస్పాన్స్ అందుకుంది.

మరో నాలుగు రోజుల్లో మూవీ థియేటర్లో సందడి అవ్వనుంది. దీంతో అటు గోపీచంద్ మలినేని.. ఇటు సన్నీ డియోల్ వివిధ పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. జాట్ మూవీ సెట్స్ కు వెళ్లారు. అక్కడ సన్నీ డియోల్, గోపీచంద్ తో ప్రభాస్ పిక్స్ దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రభాస్, సన్నీ డియోల్.. ఇద్దరూ ఫిట్ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ఇక ఈ ఫ్రేమ్ లో మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ప్రభాస్ వేల కోట్ల బిజినెస్ కలిగిన హీరో అయినప్పటికీ ఒక సీనియర్ ముందు చేతులు కట్టుకొని స్టిల్ ఇవ్వడం నిజంగా గ్రేట్. ఇప్పుడనే కాదు, ప్రభాస్ తనకంటే పెద్దవాళ్ళు చిన్న స్టార్స్ అయినప్పటికీ అదే రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు. అందుకే కదా అతన్ని డార్లింగ్ అనేది. ప్రభాస్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని దిగిన పిక్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది. మాసివ్ ఫ్రేమ్.. బాహుబలి మీట్ జాట్ అంటూ రాసుకొచ్చింది.
జాట్ సెట్స్ లో కూలెస్ట్, మోస్ట్ పవర్ ఫుల్ స్టార్స్ సన్నీ డియోల్, ప్రభాస్ తో కొన్ని చిరస్మరణీయ క్షణాలను పంచుకునే మరపురాని క్షణమంటూ గోపీచంద్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు, మూవీ లవర్స్ తెగ రెస్పాండ్ అవుతున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా హ్యాపీగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. జాట్ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడా అని అడుగుతున్నారు. మరోవైపు, సన్నీ డియోల్- ప్రభాస్ కలిసి మూవీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
సూపర్ కాంబో అని నెటిజన్లు కొనియాడుతున్నారు. త్వరలోనే తమ కోరిక నెరవేరుతుందని అంతా ఆశిస్తున్నారు. అయితే జాట్ నిర్మాతలతో ప్రభాస్ ఫౌజీ మూవీ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరికొద్ది నెలల్లో ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.