మొట్టమొదటి ఎవరెస్ట్ అధిరోహకులపై బయోపిక్
ఇప్పుడు ఆ ఇద్దరిపైనా బయోపిక్ తెరకెక్కనుంది. టెంజింగ్ అనేది టైటిల్. ఆస్కార్-విజేత నిర్మాణ సంస్థ సీ-సా ఫిల్మ్స్ తన కొత్త ప్రాజెక్ట్ `టెన్జింగ్`ని ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ని అధిరోహించిన మొట్టమొదటి మానవుడు ఎవరు? .. సోషల్ పుస్తకాల్లో జీకే ప్రశ్న ఇది. దీనికి జవాబు ఇద్దరు న్యూజిల్యాండ్ దేశస్తుల పేర్లు. సంవత్సరాల కలలు.. ఏడు వారాల అధిరోహణ తర్వాత న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ (1919-2008) - నేపాల్ కి చెందిన టెన్జింగ్ నార్గే (1914-1986) ఉదయం 11:30 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. 29 మే 1953లో ఇది సాధ్యపడింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు వీరే.
ఇప్పుడు ఆ ఇద్దరిపైనా బయోపిక్ తెరకెక్కనుంది. టెంజింగ్ అనేది టైటిల్. ఆస్కార్-విజేత నిర్మాణ సంస్థ సీ-సా ఫిల్మ్స్ తన కొత్త ప్రాజెక్ట్ `టెన్జింగ్`ని ప్రకటించింది. షెర్పా టెన్జింగ్ నార్గే న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీతో కలిసి 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అతడి చారిత్రాత్మక జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది.
ప్రఖ్యాత డెడ్‌లైన్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఈ చిత్రంలో సర్ ఎడ్మండ్ హిల్లరీగా బాఫ్టాకి నామినేట్ అయిన నటుడు టామ్ హిడిల్‌స్టన్ .. ఆంగ్ల (ఇంగ్లండ్ యాత్రికుడు) యాత్ర నాయకుడైన కల్నల్ జాన్ హంట్‌గా ఆస్కార్ గ్రహీత విల్లెం డాఫో కనిపిస్తారు. ప్రస్తుతం నార్గే పాత్రను పోషించే నటుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది.
`టెన్జింగ్` చిత్రానికి జెన్నిఫర్ పీడోమ్ దర్శకత్వం వహించనున్నాఉ. షెర్పా (పర్వతారోహకులు) కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలకు పేరుగాంచిన జెన్నిఫర్ పీడోమ్ టెన్జింగ్‌కు దర్శకత్వం వహించనున్నారు. తెరపై ఈ కథను వివరించడానికి నార్గే కుటుంబం దర్శకనిర్మాతకు ప్రత్యేక హక్కులను మంజూరు చేసింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన రచయిత ల్యూక్ డేవిస్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. సీ-సా ఫిల్మ్స్ నుండి నిర్మాతలు లిజ్ వాట్స్, ఎమిలే షెర్మాన్, ఇయాన్ కానింగ్ ఈ ప్రాజెక్ట్‌లో పీడమ్ - డేవిస్‌లతో కలిసి పని చేస్తారు. సైమన్ గిల్లిస్, డేవిడ్ మిచాడ్, నార్బు టెన్జింగ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా పనిచేస్తున్నారు.
టెన్జింగ్ టిబెట్‌లో జన్మించిన నార్గే - న్యూజిలాండ్ పర్వతారోహకుడు హిల్లరీల అసాధారణ ప్రయాణానికి సంబంధించిన కథ. వీరిద్దరూ బ్రిటిషర్స్ తలపెట్టిన సాహసయాత్రలో బయటి వ్యక్తులు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం - ఒకప్పుడు అసాధ్యమని భావించేవారు. కానీ దాన్ని సాధించడానికి వీరిద్దరూ భారీ అసమానతలను ధిక్కరించారు. ఆరు విఫల ప్రయత్నాల తర్వాత నార్గే తన అత్యంత ముఖ్యమైన అధిరోహణలో ద్రోహపూరిత రాజకీయాలు .. ప్రమాదకర వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఒక ఆఖరి ప్రయత్నం కోసం అన్నింటినీ పణంగా పెట్టాడు.
సినిమా మార్కెట్ ప్లాన్ అదుర్స్:
టెన్జింగ్ కేన్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. టెన్జింగ్ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ మార్కెట్‌లో హాట్ ప్రాజెక్ట్‌గా అంచనా వేస్తున్నారు. సీ-సా సంస్థ అంతర్గత అమ్మకాల విభాగం క్రాస్ సిటీ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ విక్రయాలను మేనేజ్ చేయనుంది. UTA ఇండిపెండెంట్ ఫిల్మ్ గ్రూప్ - క్రాస్ సిటీ ఫిల్మ్స్ సంయుక్త సేల్‌కు సహ-ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. టెన్జింగ్ చిత్రీకరణ 2025 వసంతకాలంలో ప్రారంభం కానుంది.
టెన్జింగ్ లాంటి అద్భుత కథను తెరకెక్కిస్తున్నందుకు దర్శక, నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు పీడోమ్ ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ గురించి తన థ్రిల్‌ను వ్యక్తం చేస్తూ టెన్జింగ్ నార్గే కథను తెరపైకి తీసుకురావడం కోసం నేను ఇంకా వేచి ఉండలేను అని పేర్కొన్నారు. హిడిల్‌స్టన్ డాఫో సహా తన తారాగణం పెద్ద బలం అని ఆమె ప్రశంసించింది. హిమాలయాలను అధిరోహించే తారాగణం వారి జోడీ `ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉంటుందని అంచనా వేసింది. నిర్మాతలు షెర్మాన్ -కానింగ్ పీడోమ్ ఉత్సాహానికి బాసటగా నిలిచారు. పీడమ్ దర్శకత్వంలో ఈ `ఉల్లాసకరమైన పర్వతారోహణను ప్రారంభించడంపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
పైకి వెళితే అదే అంతిమ యాత్ర:
సంవత్సరాల కలల్ని నిజం చేసుకుంటూ.. ఏడు వారాల అధిరోహణ తర్వాత, న్యూజిలాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హిల్లరీ (1919-2008)- నేపాల్ (భూటాన్) కి చెందిన టెన్జింగ్ నార్గే (1914-1986) ఉదయం 11:30 గంటలకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. 29 మే 1953లో ఇది సాధ్యమైంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా ఆ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. ఆ ఇద్దరూ అధిరోహించక మునుపు ఎవరెస్ట్ అధిరోహణకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎవరెస్ట్ శిఖరం చాలా కాలంగా అధిరోహించలేనిదిగా భావించారు. మరికొందరు అంతిమ అధిరోహణ సవాలుగా భావించారు. 29,035 అడుగుల (8,850 మీ) ఎత్తయిన హిమాలయ పర్వతసానువు నేపాల్, టిబెట్, చైనా సరిహద్దులో ఉంది.
హిల్లరీ - టెన్జింగ్ విజయవంతంగా శిఖరాగ్రానికి చేరుకోవడానికి ముందు మరో రెండు యాత్రలు విజయానికి దగ్గరయ్యాయి. జార్జ్ లీ మల్లోరీ (1886-1924) , ఆండ్రూ శాండీ ఇర్విన్ (1902-1924) .. 1924 అధిరోహణ వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది. సంపీడన వాయువు సహాయం వివాదాస్పదంగా ఉన్న సమయంలో వారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. కానీ వారు పర్వతం నుంచి తిరిగి రాకపోవడంతో అది చరిత్రగా మారలేదు. రెండవ మెట్టు (సుమారు 28,140- 28,300 అడుగులు) వద్ద ఈ జంట ఆరోహకులు చివరిగా కనిపించారు. మల్లోరీ - ఇర్విన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు కాదా? అని చాలా మంది ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు పర్వతం నుండి సజీవంగా తిరిగి రాలేదు కాబట్టి బహుశా ఇప్పటికీ ఇది మిస్టరీగానే మిగిలిపోయింది.
ఎత్తైన పర్వతాలపై ప్రమాదాలు:
మల్లోరీ - ఇర్విన్ కచ్చితంగా పర్వతంపై మరణించిన చివరివారు కాదు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అత్యంత ప్రమాదకరం. గడ్డకట్టే వాతావరణం (ఇది పర్వతారోహకులకు విపరీతమైన గడ్డకట్టే ప్రమాదాన్ని కలిగిస్తుంది) కొండ చరియల నుండి , లోతైన పగుళ్లలో దీర్ఘకాలం పడిపోవడానికి ప్రమాద సంభావ్యత చాలా ఎక్కువ. ఎవరెస్ట్ పర్వతారోహకులు చాలా గడ్డ కట్టే చలి ప్రభావాలతో బాధపడుతారు. దీనిని తరచుగా పర్వత అనారోగ్యం అని పిలుస్తారు.
అధిక ఎత్తులో ఉండటం వల్ల మానవ శరీరం మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. ఇది హైపోక్సియాకు కారణమవుతుంది. 8,000 అడుగుల పైకి ఎక్కే ఏ పర్వతారోహకుడైనా పర్వతారోహణ అనారోగ్యానికి గురవుతారు. వారు ఎంత ఎత్తుకు ఎక్కితే అంతగా ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారవచ్చు.