మాజీ ప్రియుడికి కనీసం విష్ యూ గుడ్ లక్ లేదే!
ఆ హీరో సినిమా తెలుగు లో రిలీజ్ అవుతుంటే కనీసం స్నేహితుడిగానైనా భావించి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదని అభిమానులు గుసాయిస్తున్నారు.
సెలబ్రిటీల జీవితాల్లో లవ్ ..బ్రేకప్ కామన్. ఎలాంటి కలతలు రానంత కాలం కలిసుండటం... అవి తలెత్తిన తర్వాత విడిపోవడం సహజమే. పెళ్లివరకూ వెళ్లిన జంటలు కొన్నైతే రిలేషన్ షిప్ తోనే ముగింపు పలికిన జోడీలు ఇంకెన్నో. ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రయాణాలు మొదలు పెడుతుంటారు. కాల క్రమంలో పాత ప్రియులతో అన్ని రకాల జ్ఞాపకాలు మర్చిపోయి స్నేహితులుగా మెలుగుతారు. కొందరైతే ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా జర్నీని ముందుకు తీసుకెళ్తుంటారు.
అయితే ఓ ప్రియుడి విషయంలో ఓ మాజీ ప్రియురాలు వ్యవహరిస్తోన్న తీరు అభిమానుల్లో మరోసారి చర్చకొచ్చింది. ఒకానొక సమయంలో ఇద్దరు ప్రాణసమానంగా ప్రేమించుకున్నారు. ఒకర్ని విడికి ఒకరు ఉండలేకపోయేవారు. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్దం కూడా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రే సీన్ టర్న్ అయింది. కెరీర్ పరంగా ఎదుగుదల చూసిన హీరోయిన్ అంతకు మించి కొత్త జీవితాన్ని...భవిష్యత్ ని ఊహించుకుంది.
దీంతో ప్రేమకు కటీఫ్ చెప్పేసిందని ఓ రూమర్ ఉంది. విడిపోవడానికి ఇదే కారణమా? ఇంకేదైనా ఉందా? అన్నది తెలియదుగానీ అభిమానులు మాత్రం ఆ హీరోయిన్ తీరునే ప్రశ్నించారు. ఆ సంగతి పక్కనబెడితే ఇప్పుడా హీరోయిన్ తెలుగులో అగ్ర నాయికగా కనసాగుతుంది.
హిందీ భాషలోకి వెళ్లింది. కెరీర్ పరంగా ఆ హీరో కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయితే ఇప్పుడా మాజీని కనీసం ఓ స్నేహితుడిలా కూడా ట్రీట్ చేయడం లేదని కొన్ని సంకేతాల్ని బట్టి తెలుస్తోంది. ఆ యంగ్ హీరో చాలా కాలంగా తెలుగులోనూ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
కానీ ఇక్కడ నుంచి సరైన సపోర్ట్ దొరకడం లేదు. ఇప్పుడా హీరోయిన్ సహాయం చేసే స్థాయిలో ఉన్నా! పట్టి పట్టనట్లు..అంటి అంటనట్లు వ్యవహరిస్తోంది. చివరికి సన్నివేశం ఎంతవరకూ వచ్చిందంటే ఆ హీరో సినిమా తెలుగు లో రిలీజ్ అవుతుంటే కనీసం స్నేహితుడిగానైనా భావించి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదని అభిమానులు గుసాయిస్తున్నారు. ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా ఎన్ని జంటలు లేవు అన్న కారణాన్ని తెరపైకి తెస్తున్నారు.