మాజీ సీఎం భార్య ఈ రేంజ్ లోనా?
అఘోర గెటప్ ఉన్న ఫోటోని ఆమె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసారు. అచ్చంగా అఘోరానే తలపిస్తుంది. రాధిక అఘోర ఆహార్యం ఆకట్టుకుంటుంది. ఆమె పోషిస్తున్న ఈ పాత్ర నెట్టింట హాట్ టాపిక్ గానూ మారింది.
కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక ఎంత ఫేమస్ తెలిసిందే. నటిగా కంటే రాధిక సీఎం భార్యగా దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. ఇక రాధిక తెలుగు ప్రేక్షకులకు పెళ్లికి ముందే సుపరిచితం. తారకరత్న సరసన 'భద్రాది రాముడు' సినిమాలో నటించారు. ఆ తర్వాత ' అవతారం' అనే మరో సినిమాలోనూ కనిపించారు. అయితే రాధిక నటిగా ఇక్కడంత సక్సెస్ అవ్వలేదు. దీంతో కోలీవుడ్ లోనే కెరీర్ ని స్థిరం చేసుకున్నారు.
ఆమె అక్కడే ఎక్కువ సినిమాలు చేసారు. ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. కుమార్ స్వామిని వివాహం చేసుకున్నా ఆమె కన్నడలో మాత్రం సినిమాలు ఆపలేదు. యధావిధిగా నటనారంగంలో రాణిస్తు న్నారు. పెళ్లికి...వృత్తి పరమైన జీవితానికి ఏమాత్రం సంబంధం లేదని చాటి చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో 'అజాగ్రత్త'..'భైరాదేవి' చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో ఆమె శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారు.
శశిధర్ దర్శకత్వం వహిస్తోన్న 'అజాగ్రత్త' సినిమాలో కొంత మంది బాలీవుడ్ నటీనటులు కూడా భాగమవు తున్నారు. సినిమాని ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక 'భైరాదేవి' చిత్రంలో రాధిక ఏకంగా అఘోర పాత్రలోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడే రోల్ కావడంతో రాధిక ఈ పాత్రని సవాల్ గా భావించి చేస్తున్నారుట.
అఘోర గెటప్ ఉన్న ఫోటోని ఆమె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసారు. అచ్చంగా అఘోరానే తలపిస్తుంది. రాధిక అఘోర ఆహార్యం ఆకట్టుకుంటుంది. ఆమె పోషిస్తున్న ఈ పాత్ర నెట్టింట హాట్ టాపిక్ గానూ మారింది. కేవలం ఒకే జానర్ పాత్రలకే కాకుండా? వైవిథ్యమైన చిత్రాలతోనూ రాధిక మెప్పిస్తోన్న వైనం ప్రశంసనీయం. నటిగా తనకంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీ ఉండే కథలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్వయంగా రాధికా కుమార్ స్వామి సొంత భ్యానర్లోనే నిర్మిస్తున్నారు.