ఆ హీరోతో సమంత కెమిస్ట్రీ గురించి పెద్దావిడ ఏమందంటే?
ఇండియన్ వెర్షన్ `సీటాడెల్: హనీ బెన్నీ` లో వరుణ్ ధావన్ -సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే.
ఇండియన్ వెర్షన్ `సీటాడెల్: హనీ బెన్నీ` లో వరుణ్ ధావన్ -సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటీవలే లండన్ లో స్పెషల్ ప్రీమీయర్ సైతం వేసారు. దీనికి హాలీవుడ్ దిగ్గజాలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాలీవుడ్ నిర్మాత గినా గార్డి తెలుగు వెర్షన్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇండియన్ వెర్షన్ చూసి ఆశ్చర్యపోయాను.
మొదటి ఎపిసోడ్ ని ఒకసారి కాదు..చాలాసార్లు చూసాను. వరుణ్ -సమంత బాగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. వీళ్ల పాత్రల్లో ఊహించని ట్విస్టులుంటాయి. రాజ్ అండ్ డీకేలంటే నాకెంతో అభిమానం. వాళ్ల ప్రాజెక్ట్ లు అన్నీ భిన్నంగా ఉంటాయి. నేను కూడా ఇందులో భాగమైనందకు సంతోషంగా ఉంది. అందరి అంచనాలు ఇది అందుకుంటుంది` అన్నారు.
ఈ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్స్ట్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. మరి అమ్మడి పెర్మార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తుంది. ముంబైలోనే నివాసం ఉంటుంది. అక్కడ నుంచి అవసరం మేర విదేశాలు వెళ్తుంది. అతి ముఖ్యమైన పనులు ఉంటే తప్ప హైదరాబాద్ రావడం లేదు.
నాగచైతన్యతో విడాకులు అయిన తర్వాతే సమంత ఈ రకమైన డెసిషన్ తో కనిపిస్తుంది. ఇటీవలే కొండా సురేఖ వ్యాఖ్యలపై కూడా సమంత రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిగా సురేఖ సమంతకి క్షమాపణలు చెప్పడం జరిగింది.